నాలుగో పెళ్లికి రెడీ అయిన నవమన్మధుడు.. కొత్త భార్యను వెతికే పనిలో ముగ్గురు భార్యలు.. ఎక్కడంటే?

ముచ్చటగా ముప్పై ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి కాని ప్రసాదులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారికి అమ్మాయిలు దొరకక వివాహం చేసుకోవడం లేదు.

news18-telugu
Updated: November 19, 2020, 7:09 PM IST
నాలుగో పెళ్లికి రెడీ అయిన నవమన్మధుడు.. కొత్త భార్యను వెతికే పనిలో ముగ్గురు భార్యలు.. ఎక్కడంటే?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ముచ్చటగా ముప్పై ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి కాని ప్రసాదులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారికి అమ్మాయిలు దొరకక వివాహం చేసుకోవడం లేదు. కానీ, పాకిస్తాన్కు చెందిన ఒక వ్యక్తి మాత్రం 22 ఏళ్ల వయస్సులోనే నాలుగో పెళ్లికి రెడీ అయ్యాడు. ఆయనకు ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్నాడు. అయినప్పటికీ పెళ్ళిపై మోజు మాత్రం తీరలేదు. అందుకే నాలుగో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన ముగ్గురు భార్యల దృష్టికి తీసుకురాగా ఆశ్చర్యకరంగా వారు కూడా మనస్పూర్తిగా సమ్మతించడం విశేషం. అంతేకాదు, నాలుగో భార్యను వెతికే బాధ్యతను ఆ ముగ్గురు భార్యలు తమ భుజాలపై వేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్లే పాకిస్తాన్ సైల్కోట్లో నివసిస్తున్న అద్నన్ 16 ఏళ్ల వయసులోనే మొదటిసారి వివాహం చేసుకున్నాడు. మొదటిసారి వివాహం చేసుకున్నప్పుడు ఆయన విద్యార్థిగానే ఉన్నాడు. అయితే, నాలుగేళ్ల తర్వాత అనగా 20 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు రెండోసారి వివాహం చేసుకున్నాడు. కాగా, గత ఏడాది మూడో వివాహం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఇప్పుడు నాలుగో పెళ్లికి కూడా సిద్దమవుతున్నాడు. 22 ఏళ్ల వయసులో అతను చేసుకోబోతున్న నాల్గవ భార్య పేరు కూడా మిగిలిన ముగ్గురు భార్యలు షుంబాల్, షుబానా, షాహిదా లాగే ‘ఎస్’ అక్షరంతో ప్రారంభం కావాలని షరతు కూడా విధించాడు. కాగా, అద్నాన్కు ప్రస్తుతం మొత్తం ఐదుగురు పిల్లలున్నారు. మొదటి భార్య షుంబల్కు ముగ్గురు పిల్లలు, రెండో భార్య షుబానాకు ఇద్దరు పిల్లలు జన్మించారు. కాగా, రెండో భార్య షుబానాకు పుట్టిన ఇద్దరు పిల్లలలో, ఒకరిని మూడో భార్య షాహిదా దత్తత తీసుకుంది.

పెళ్ళి చేసుకున్న ప్రతిసారి ఆదాయం పెరుగుతోంది..
అద్నన్ ముగ్గురు భార్యలు, పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ముగ్గురిలో ఎవరితో ఎక్కువ సేపు గడపాలనే నిర్ణయాన్ని కూడా భర్తకే వదిలేశారు. కాగా, తన భార్యలందరి ఖర్చులను ఎలా నిర్వహిస్తావని అతన్ని కొందరు అడగ్గా “తాను ఆరు బెడ్ రూములు, డ్రాయింగ్ రూమ్, స్టోర్ రూమ్ ఉన్న విశాలవంతమైన ఇంట్లో తన భార్యాపిల్లలతో నివసిస్తున్నాను. నా మొదటి వివాహం తరువాత ఆర్ధికంగా వృద్ధి చెందాను. నేను పెళ్ళి చేసుకుంటున్న ప్రతి సారి నా ఆదాయం పెరుగుతుంది.

ప్రస్తుతం నా కుటుంబ పోషణకు నెలకు లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చవుతుంది. నా కుటుంబ ఖర్చును నిర్వహించడంలో ఎటువంటి సమస్య లేదు. అంతేకాక, నా ముగ్గురు భార్యలు ఒకరితో ఒకరు బాగా సర్దుకుంటారు. అయితే, నేను వారితో తగిన సమయం గడపడం లేదనే ఏకైక ఫిర్యాదును అప్పుడప్పుడు ఎదుర్కొంటుంటాను. నా ముగ్గురు భార్యలు నన్ను అమితంగా ప్రేమిస్తున్నారు. నేను కూడా వారిని చాలా ప్రేమిస్తున్నాను. నా ముగ్గురు భార్యలు ఇంటి పనులను కూడా తమలో తాము పంచుకుంటారు. నా వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటారు.” అని అద్రన్ పేర్కొన్నాడు.
Published by: Sumanth Kanukula
First published: November 19, 2020, 7:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading