సుష్మాస్వరాజ్‌కు ట్వీట్లతో నివాళి అర్పించిన పాక్.. ఆమె మళ్లీ పుడితే..

Sushma Swaraj: గుండె పోటుతో సుష్మాస్వరాజ్ మరణించడంతో పాక్ జాతీయులు ఆమెపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 8, 2019, 12:30 PM IST
సుష్మాస్వరాజ్‌కు ట్వీట్లతో నివాళి అర్పించిన పాక్.. ఆమె మళ్లీ పుడితే..
సుష్మాస్వరాజ్
  • Share this:
భారత్, పాకిస్థాన్.. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంత శత్రుత్వం. దానికి తోడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు. దాయాది దేశస్థుడు కనిపిస్తే పొడిచేసేంత కోపం.. కానీ, సుష్మాస్వరాజ్ మాత్రం అందుకు భిన్నం.. శరణు కోరితే సహాయం అందించే గొప్ప మనసున్న చిన్నమ్మ.. అది శత్రు దేశానికి చెందిన వారైనా సరే.. ఏ మాత్రం సంకోచించకుండా వారికి సహాయ సహకారాలు అందిస్తారు. అందుకే ఆమెపై అభిమానానికి ఎల్లలు ఉండవు. ఇది మరోసారి రుజువైంది. గుండె పోటుతో సుష్మాస్వరాజ్ మరణించడంతో పాక్ జాతీయులు ఆమెపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాను విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో పాకిస్థాన్‌కు చెందిన వారికి మెడికల్ వీసాలు జారీ చేశారు. ఏడాది పాపకు ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం, ఓ వ్యక్తి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం ట్విట్టర్‌లో అభ్యర్థించగానే వెంటనే వీసాలు జారీ చేయించారు.
పాక్ జాతీయులకు సుష్మ చేసిన సహాయాన్ని ఓ సారి పరిశీలిస్తే..

హిరా సిరాజ్ అనే మహిళ తన ఏడాది పాప ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం మెడికల్ వీసా జారీ చేయాలని సుష్మాను కోరింది. వెంటనే స్పందించిన ఆమె.. వీసా జారీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


అలాగే, తన సోదరుడికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని, వీసా ఇప్పించాలని లాహోర్‌కు చెందిన ఇక్బాల్ అనే వ్యక్తి కోరాడు. అందుకు దేవుడి తర్వాత తమరే నమ్మకం అని ట్వీట్ చేశారు. దీంతో ఆమె స్పందిస్తూ.. ‘మీ నమ్మకాన్ని భారత్ కోల్పోనివ్వదు’ అని ట్వీట్ చేస్తూ వీసా జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇలా ఎంతో మంది పాక్ జాతీయులకు ఆమె ఆపన్న హస్తం అందించారు.
సహాయం అందుకున్న వారే కాకుండా, సుష్మాస్వరాజ్ సహాయం గురించి తెలిసిన పాక్ జాతీయులు కూడా ఆమెకు ట్వీట్లతో నివాళి అర్పించారు. సుష్మా మృతి తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ అల్లాను కోరుకుంటున్నానని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఓ వ్యక్తి అయితే.. ముస్లిములమైన తాము మరో జన్మను నమ్మబోమని, ఒక వేళ అదే జరిగితే.. సుష్మా పాకిస్థాన్‌లో పుట్టాలని, ఇక్కడ రాజకీయనాయకురాలు కావాలని తాను కోరుకుంటున్నానని కామెంట్ చేశాడు.

First published: August 8, 2019, 12:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading