Home /News /trending /

PAKISTAN OPPOSITION LEADER CONTROVERSIAL COMMENTS ON IMRAN KHAN WIFE BUSHRA GOES VIRAL PAH

ఇమ్రాన్ ఖాన్ మూడో భార్యపై సంచలన ఆరోపణలు.. ఆమె ఇంట్లో చేతబడి జరుగుతుంది.. కారణం అదేనా..

ఇమ్రాన్ ఖాన్ (ఫైల్)

ఇమ్రాన్ ఖాన్ (ఫైల్)

Pakistan: ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయనపై జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆయన ఈ అనిశ్చితి నుంచి బైటపడేందుకు ఆయన భార్య జంతు బలులు ఇస్తుందని పాకిస్థాన్ ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ ఆరోపిస్తున్నారు.

ఇంకా చదవండి ...
Imran Khan:  పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ తీవ్ర రాజకీయ అనిశ్చితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయనను గద్దెనుంచి దింపాలని స్వపకంతో పాటు, ప్రతి పక్షాలు కూడా గట్టిగా నిర్ణయించుకున్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్ని ఆర్థిక పరిస్థితులకు, నిరుద్యోగితకు ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణం అని ప్రజలు, రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. బంధు ప్రీతి, దేశ ద్రవ్యోల్బణం.. అధిక ధరలు, కరోనా కట్టడిలో ఘోరంగా విఫలం, అప్పులు, నిరుద్యోగుల నిరసనలతో పీటీఐ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్‌లో నిరసనలు పెలుబిక్కాయి. ఈ నిరసనలనే ఆయుధంగా చేసుకుని ప్రధాని ఇమ్రాన్ ​ఖాన్​పై జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ మూడో భార్య బుష్రా బీబీ ఇమ్రాన్ వార్తలలో నిలిచారు. బుష్రా బీబీ.. తన ఇంట్లో కోళ్లను బలిస్తున్నారని ప్రతి పక్షనేత షాబాజ్ ఆరోపణలు గుప్పించారు. ఇమ్రాన్ ఖాన్.. మూడో భార్య ఇంట్లో టన్నుల కొద్ది కోళ్లను బలిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. బుష్రా బీబీ పాక్ లోని పాక్ పట్టణ నగరంలో జన్మించారు. ఆమె కుటుంబానికి పంజాబ్, పాక్ లో మంచి రాజకీయంగా పట్టు ఉంది. 12 వ శతాబ్దంలో సూఫీ సన్యాసీ బాబా షరీఫ్ దర్గాగా ప్రసిద్ధి చెందారు. ఆయన పట్టణంలోనే బుష్రా జన్మించారు. ఆమె 1974 ఆగస్టు 16 న జన్మించారు.

బుమ్రా తన మొదటి భర్తకు 2017 లో విడాకులు ఇచ్చి.. ఇమ్రాన్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. ఆమెకు అప్పటికే.. 3 కూతుళ్లు, 2 కుమారులు. ఆ తర్వాత... వీరికి పరిచయం ఏర్పడింది. ఆమె ఇమ్రాన్ కు ఆధ్యాత్మిక సలహాలు ఇచ్చేది. ఈ క్రమంలో వీరిద్దరు 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సంక్షోభ సమయాల్లో బుష్రా.. ఇమ్రాన్‌కు సలహాలు ఇచ్చారు. ఇక బుష్రా ముఖం కూడా చూడకుండా ఇమ్రాన్ పెళ్లి చేసుకున్నాడని కథనం ప్రచారంలో ఉంది. పెళ్లి నాటికి ఇమ్రాన్ కు 66 ఏళ్లు, బుష్రాకు 44 ఏళ్ల వయసు ఉంది. తనను పెళ్లి చేసుకుంటే.. ఇమ్రాన్ ప్రధాని అవుతారని బుష్రా ఆయనతో చెప్పిందని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

ప్రస్తుతం.. అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ ఒక‌టి నుంచి 4వ తేదీ మ‌ధ్య ఓటింగ్ ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన మూడు రోజుల క‌న్నా ముందు ఓటింగ్ నిర్వ‌హించ‌రాదు, అలాగే ఏడు రోజుల గ‌డువు కూడా దాట‌రాదు. 342 మంది సభ్యులు ఉన్న నేషనల్‌ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ను తొలగించాలంటే విపక్షాలకు 172 మంది మద్దతు కావాలి. అధికార పీటీఐకి 155 మంది సభ్యులుండగా, నాలుగు మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వానికి మొత్తం 179 మంది సభ్యుల బలముంది. కానీ, ఇమ్రాన్‌ సొంత పీటీఐ పార్టీకి చెందిన 25 మంది, అధికార సంకీర్ణ కూటమిలోని 23 మంది.. ధిక్కార స్వరం వినిపించడం,పలువురు ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎంపీలు మరో పార్టీలోకి జంప్ అవుతుండటంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Imran khan, Pakistan

తదుపరి వార్తలు