Viral: ‘ఫార్ములా వన్‌’ రేసింగ్ ఈవెంట్‌పై జర్నలిస్టు ఫన్నీ ప్రశ్నలు.. వైరల్ అవుతున్న వీడియో

(Image Credits: Twitter/@alaiqasim)

పాకిస్థాన్‌ జర్నలిస్టులు, అక్కడి సోషల్ మీడియా సెలబ్రిటీలు మీమ్ క్రియేటర్లకు ఒక వనరుగా మారుతున్నారు. గతంలో ఎన్నోసార్లు పాక్ జర్నలిస్టులు చేసిన తప్పులను నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌గా క్రియేట్ చేసి వైరల్ చేశారు.

  • Share this:
పాకిస్థాన్‌ జర్నలిస్టులు, అక్కడి సోషల్ మీడియా సెలబ్రిటీలు మీమ్ క్రియేటర్లకు ఒక వనరుగా మారుతున్నారు. గతంలో ఎన్నోసార్లు పాక్ జర్నలిస్టులు చేసిన తప్పులను నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌గా క్రియేట్ చేసి వైరల్ చేశారు. తాజాగా పాక్ మహిళా జర్నలిస్టు చేసిన ఒక పాత ఇంటర్వ్యూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు గుడ్ మార్నింగ్ పాకిస్థాన్(Pakistan) టీవీ హోస్ట్ నిదా యాసిర్‌ను(Nida Yasir) మీమ్స్ క్రియేటర్లు, నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. 2016 నాటి ఓ ఇంటర్వ్యూలో ఫార్ములా వన్ రేసింగ్ కారు గురించి ఇద్దరు రేసర్లను ఆమె ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ వీడియో ట్విట్టర్‌లో టాప్ ట్రెండ్‌గా మారింది.

ప్రముఖ అంతర్జాతీయ ఆటో రేసింగ్ 'ఫార్ములా 1'(Formula 1) పేరును నిదా యాసిర్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఫార్ములా వన్ అంటే నిజమైన సైంటిఫిక్ ఫార్ములా అని ఆమె భావించారు. దానికి కూడా థియరీ, సైంటిఫిక్ ఎక్స్‌పరిమెంట్స్ ఉంటాయని అనుకున్నారు. ఫార్ములా 1 కారుకు ఒక సీటు మాత్రమే ఉంటుందని ఆమెకు వివరించడానికి ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు వివరించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆమె మాత్రం ఆ విషయాన్ని అర్థం చేసుకోలేదు.

యాసిర్ వారిని ప్రశ్నలు అడుగుతూ.. "మీరు ఒక వ్యక్తి మాత్రమే కూర్చునే చిన్న కారుతో రేసు ప్రారంభించారా? ఈ ఫార్ములాను కొత్తగా కనుగొన్నారా? మీరు ఆ ఫార్ములాపై ప్రయోగాలు చేశారా?" అని ప్రశ్నించారు. దీంతో నవ్వుకోవడం వారి వంతు అయింది. ఇంటర్వ్యూ చివర్లో కూడా ఆమె ఫార్ములా వన్ కారు గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు.

Ind Vs Eng: నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం.. విజృంభించిన భారత బౌలర్లు.. సిరీస్‌లో 2-1తో ఆధిక్యం..

అయితే ఇంటర్వ్యూ చేసే ముందు టాపిక్‌పై కనీస అవగాహన లేకుండా ప్రశ్నలు అడిగిన నిదాను నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ చూస్తే ఫార్ములా వన్ రేసర్ లూయిస్ హమిల్టన్ ఆత్మహత్య చేసుకుంటాడని ఒక నెటిజన్ కామెంట్ రాశాడు. చాలామంది మీమ్స్‌ రూపొందించి ఈ వీడియోకు ఫన్నీ రిప్లైలు ఇస్తున్నారు.

Pakistan Cricket: టీ 20 వరల్డ్ కప్ ముందు పాక్ క్రికెట్‌కు భారీ షాక్.. రాజీనామా చేసిన మిస్బా ఉల్ హక్, వకార్ యూనిస్

గతంలోనూ పాకిస్థానీ మీడియా(Pakistan Media) బులెటిన్ల వీడియోలు, అక్కడి జర్నలిస్టుల వింత కార్యకలాపాలు వైరల్‌గా మారాయి. 2019లో పాకిస్థాన్ న్యూస్ యాంకర్ ఒక టీవీ చర్చ సందర్భంగా యాపిల్ సంస్థను యాపిల్ పండుగా భావించి, తరువాత నాలుక కరుచుకున్నారు. మరో వీడియోలో.. వరదల గురించి నివేదిస్తున్న ఒక పాకిస్థానీ రిపోర్టర్, మెడలోతు నీటిలోకి వెళ్లి మరీ పరిస్థితి తీవ్రతను వివరించారు. ఆజాదర్ హుస్సేన్ అనే ఈ రిపోర్టర్.. తన పాత్రికేయ నైపుణ్యాలతో నెటిజన్లను ఆకట్టుకున్నారు. మరో పాక్ రిపోర్టర్ అమిన్ హఫీజ్ ఒక రాజులా వేషం వేసుకొని వార్తలు అందించారు. వార్తల నేపథ్యాన్ని వివరించే పీస్- టూ- కెమెరా క్లిప్ కోసం హఫీజ్ ఏకంగా కత్తిని చేతిలో పట్టుకొని రాజుగా రిపోర్టింగ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది.

https://twitter.com/aliqasim/status/1434104584427999232?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1434104584427999232%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.timesnownews.com%2Fthe-buzz%2Farticle%2Fpakistani-tv-anchors-misunderstanding-of-formula-one-leaves-netizens-rofl-ing-watch%2F807882

ఫార్ములా వన్ కారు అనేది సింగిల్ సీట్, ఓపెన్-కాక్‌పిట్, ఓపెన్-వీల్ ఫార్ములా రేసింగ్ కారు. ఫార్ములా వన్ రేసింగ్ ఈవెంట్ పోటీల్లో పాల్గొనేందుకు వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తారు. వీటిలో డ్రైవర్ సీటు వెనుక ఇంజిన్ ఉంటుంది. ఇవి సాధారణ కార్లకు భిన్నంగా ఉంటాయి. డిజైన్, తయారీని ఔట్‌సోర్సింగ్ ద్వారా చేపట్టినప్పటికీ, రేసింగ్ టీమ్‌లే ఈ కార్లను రూపొందిస్తాయి.
Published by:Sumanth Kanukula
First published: