కుళ్లుబోతుల పాకిస్థాన్... ఇస్లామాబాద్‌లో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం నిలిపివేత...

పాకిస్థాన్ పాలకులు ఇంకా మత ఛాందస భావాల్ని వీడలేదా? ఓ చిన్న హిందూ ఆలయం నిర్మిస్తే కొంపలు మునిగిపోతాయా అని నెటిజన్లు నిలదీస్తున్నారు.

news18-telugu
Updated: July 5, 2020, 10:11 AM IST
కుళ్లుబోతుల పాకిస్థాన్... ఇస్లామాబాద్‌లో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం నిలిపివేత...
కుళ్లుబోతుల పాకిస్థాన్... ఇస్లామాబాద్‌లో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం నిలిపివేత... (File)
  • Share this:
సరికొత్త పాకిస్థాన్‌ను నిర్మిస్తానంటూ ప్రధానమంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్‌పై భారతీయులకు ఇప్పటివరకూ ఒకింత మంచి అభిప్రాయం ఉంది. ఇందుకు రెండు కారణాలు. ఆయన మాజీ క్రికెటర్ కావడం ఒక కారణమైతే... మిగతా నేతల్లాగా మరీ ఛాందస భావాలతో ఉండరనే ఆలోచన రెండోది. కానీ... తాజాగా ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టీ... ఆయన కూడా ఆ తానులో ముక్కే అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే... ఇమ్రాన్ ప్రభుత్వం... ఇస్లామాబాద్‌లో నిర్మిస్తున్న శ్రీకృష్ణ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకొని ఆపేసింది. ఈ ఆలయం నిర్మిస్తున్నారనగానే భారతీయులంతా... పాకిస్థాన్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. పోనీలే... ఆ దేశం కూడా ఇండియాలాగా లౌకిక దేశంగా మారుతుందేమో అనుకున్నారు. తీరా... ఇస్లామిక్ పెద్దలు, తీవ్ర భావాలున్నవారు ప్రభుత్వంపై ఒత్తిడి తేగానే... పాక్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ ఆథార్టీ... ఆలయ నిర్మాణాన్ని ఆపేసింది.

పాక్‌లోని పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ చౌదరీ పర్వేజ్ ఇలాహీ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి ఆజ్యం పోశాయి. ఓ మీడియా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో... ఈ ఆలయ నిర్మాణం... ఇస్లాం మత సిద్ధాంతాలకు వ్యతిరేకం అనీ... మదీనాను అవమానించడమేనని ఆయన అన్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని పాకిస్థాన్ ప్రజల్లో కొంత మంది స్వాగతించారు. కొంత మంది వ్యతిరేకించారు. వెంటనే ట్విట్టర్‌లో #MandirTauBanega (మందిరాలూ నిర్మించాలి) అనే హ్యాష్ ట్యాగ్ మొదలైంది. పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా... అందరికీ సమాన హక్కులు ఉంటాయని అన్నారు కాబట్టి... మనం మసీదులు నిర్మించుకున్నట్లే... ఆలయాలూ నిర్మించుకోవాలి అని ఓ పాకిస్థాన్ నెటిజన్ అభిప్రాయపడ్డారు.

మరో నెటిజన్... లాహోర్‌లోని 70 శాతం మసీదులను అక్రమంగా నిర్మించారని అన్నారు. ఈ మందిరం చట్టబద్ధంగా నిర్మిస్తున్నారనీ... అసంబద్ధంగా కాదని అన్నారు.

పాకిస్థాన్‌లో నిర్మిస్తున్న ఆలయ బౌండరీ గోడను ఓ ఇద్దరు యువకులు కూల్చుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published by: Krishna Kumar N
First published: July 5, 2020, 10:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading