• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • PAKISTAN FOREIGN MINISTER SHAH MAHMOOD QURESHI TRIES TO EAT CAKE WITH HIS MASK VIDEO GOES VIRAL SRD

Viral Video : ఇదేం కక్కుర్తి సామి.. మాస్క్ తోనే కేక్ తినడానికి పాక్ మంత్రి ఆరాటం...వైరల్ వీడియో

Viral Video : ఇదేం కక్కుర్తి సామి.. మాస్క్ తోనే కేక్ తినడానికి  పాక్ మంత్రి ఆరాటం...వైరల్ వీడియో

Photo Credit : Twitter

Viral Video : పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, ఈ సారి భారత్ పై విషాన్ని చిమ్మినందుకు కాదు.. మంత్రి గారి కక్కుర్తితో వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు.

  • Share this:
    పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, ఈ సారి భారత్ పై విషాన్ని చిమ్మినందుకు కాదు.. మంత్రి గారి కక్కుర్తితో వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు. అసలే పాకిస్థాన్ లో కరోనా విజృంభిస్తోంది. దీంతో ఆంక్షలు అమల్లో ఉన్నాయ్. కానీ, మంత్రి అయ్యి ఉండి కరోనా నిబంధనల్ని తుంగలో తొక్కుతూ.. రూల్స్ ను బ్రేక్ చేసి వార్తల్లో నిలిచారు మహ్మద్ ఖురేషీ. ఇప్పుడు ఆ పాక్ మంత్రి గారి చేసిన బిత్తిరి పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే..భారత్‌పై విషాన్ని చిమ్మి వార్తల్లో నిలిచే పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ ఈసారి ఓ బిత్తిరి చర్యతో సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. పాకిస్తాన్‌లోని ముల్తాన్‌లో ఇటీవల నిర్మించిన రోడ్డును ప్రారంభించడానికి వచ్చిన ఖురేషీ కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి వార్తల్లో నిలిచారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఒక పెద్దకేకును కట్‌ చేశారు. కరోనా నిబంధనల్ని మరచి.. కేక్‌ కావాలా తీసుకొండని మంత్రి అక్కడున్న జనానికి సూచించారు.

    దీంతో కారక్రమానికి హజరైనవారు కేక్‌ ముక్క కోసం ఎగబడ్డారు. వారిలో ఏఒక్కరు కూడా సామాజిక దూరం పాటించలేదు. మాస్క్‌లు ధరించలేదు. ఏ ఒక్కరూ కూడా కరోనా రూల్స్ పాటించలేదు. అంతే కాదు.. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే మాస్కు ధరించిన మంత్రి ఖురేషీ కూడా కేక్‌ కోసం చొంగ కార్చుకున్నాడు. తన నోటికి మాస్కు ఉందన్న సంగతి మరచి.. కేక్‌ తినేందుకు ఆరాటపడ్డాడు. మంత్రిగారి వ్యవహారానికి సంబంధించిన వీడియోను పాక్‌ జర్నలిస్ట్‌ నాయ్‌లా ఇనాయత్‌ సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.


    మహ్మద్ ఖురేషీ ప్రవర్తన పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కోవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో బాధ్యత గల పదవిలో ఉండి ఇవే పిల్ల చేష్టలు అని తిట్టిపోస్తున్నారు. మరి కేక్ కోసం ఇంత తాపత్రయమా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు