ICC World Cup 2019: పాక్ ఆటగాళ్లకు క్షమాపణ చెప్పిన ఫ్యాన్స్...

ICC World Cup 2019 | దక్షిణాఫ్రికాపై 49 పరుగుల తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్ జట్టు...వరల్డ్ కప్ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

news18-telugu
Updated: June 24, 2019, 2:43 PM IST
ICC World Cup 2019: పాక్ ఆటగాళ్లకు క్షమాపణ చెప్పిన ఫ్యాన్స్...
సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకున్న పాక్‌ను ఆకాశానికెత్తేస్తున్న ఆ దేశ ప్యాన్స్
  • Share this:
గెలిస్తే భుజాలపైకి ఎత్తుకోవడం...ఓడితే అక్కడి నుంచి ఒక్కసారిగా కిందకు పడేయడం పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌కు బాగా అలవాటే. క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత చేతిలో చిత్తుగా ఓడిన పాక్ ఆటగాళ్లను ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ ఓ స్థాయిలో ఏకిపారేయడం తెలిసిందే. మాజీ పాక్ క్రికెటర్లు కూడా తమ ఆటగాళ్లను ఉతికి ఆరేశారు.  సోషల్ మీడియాలోనూ పాక్ ఆటగాళ్లపై ట్రోల్స్‌తో దంచేశారు. అదంతా గతం. ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆదివారం లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా‌పై 49 పరుగుల తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్ జట్టు...సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంది.

దీంతో పాక్ ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా ఆ దేశ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో పాక్ ఆటగాళ్లు అసమర్థులుగా ట్రోల్స్ చేసినందుకు క్షమాపణ చెబుతూ కమెంట్స్ పెడుతున్నారు. అటు ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా తమ ఆటగాళ్లకు బాసటగా నిలుస్తున్నారు. భారత్‌తో ఓటమి గురించి పట్టించుకోకుండా...మిగిలిన మ్యాచ్‌లపై దృష్టిపెట్టాలని, సెమీస్‌లో బెర్త్ ఖాయం చేసుకోవాలని మాజీ క్రికెటర్లు పాక్ కెప్టెన్ సర్ఫ్‌రాజ్‌కు సూచిస్తున్నారు.

లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాపై విజయం తర్వాత పాక్ కెప్టెన్ సర్ఫ్‌రాజ్‌కు పాక్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆయన ఆటోగ్రాఫ్ కోసం పోటీపడ్డారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ వీడియోను తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

అటు సర్ఫ్‌రాజ్‌కు క్షమాపణ చెబుతూ పలువురు నెటిజన్స్ ట్వీట్స్ చేశారు.

Published by: Janardhan V
First published: June 24, 2019, 2:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading