హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : విమానంలో పాక్ యువకుడు రచ్చ రచ్చ..సంకెళ్లు వేసి కట్టేసిన సిబ్బంది!

Viral Video : విమానంలో పాక్ యువకుడు రచ్చ రచ్చ..సంకెళ్లు వేసి కట్టేసిన సిబ్బంది!

విమానంలో ప్రయాణికుడు రచ్చ

విమానంలో ప్రయాణికుడు రచ్చ

Man Tried To Break Flight Window : పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) లో వింత ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు నానా హంగామా సృష్టించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Man Tried To Break Flight Window : పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) లో వింత ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు నానా హంగామా సృష్టించాడు. షర్టు విప్పేసి..సీట్లపై పిడిగుద్దులు కురిపించి, విమానం అద్దాలను కాలితో తన్నుతూ రచ్చ రచ్చ చేశాడు. విమానం(Flight)లో యువకుడి చర్యలు అందరినీ ఉలిక్కిపడేలా చేశాయి. చివరికి ఆ యవకుడి చేష్టలకు విసిగిపోయిన సిబ్బంది అతడిని సీటుకు కట్టేశారు. దీనకి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్(Viral) గా మారింది. ఈ ఘటన తర్వాత ఆ యువకుడిని భవిష్యత్తులో విమానంలో ఎక్కకుండా బ్లాక్ లిస్ట్ లో చేర్చారు.

అసలేం జరిగింది

సెప్టెంబర్ 14న పాకిస్తాన్(Pakistan) లోని పెషావర్ నుంచి దుబాయ్(Dubai) కి PK-283 విమానం బయల్దేరింది. అయితే విమానం గాల్లో ఉన్న సమయంలో ప్రయాణికుల్లోని ఓ యువకుడు వింతగా ప్రవర్తించాడు. షర్ట్ విప్పేసి అర్థనగ్నంగా పిచ్చి చేష్ఠలు చేయడం మొదలుపెట్టాడు. ఫ్లైట్ కిటికీల వద్దకు వెళ్లి కాలితో తన్నడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే అతడిని సముదాయించేందుకు వచ్చిన విమాన సిబ్బందితో ఘర్షణకు దిగిన ఆ ప్రయాణికుడు.. కోపంతో సీట్లపై పిడిగుద్దులు కురిపించాడు. మరోసారి గాల్లో ప్రయాణిస్తున్న విమానం కిటికీలను కాళ్లతో తన్నాడు. వాటిని పగలగొట్టేందుకు యత్నించాడు. విమానం కిటికీ అద్దాలను, సీట్లను కాలితో తన్నడంతో పాటు అకస్మాత్తుగా విమానం నేలపై పడుకున్నాడు. ఫ్లైట్ అటెండెంట్ యువకుడి దురుసుతనాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించగా అతనిపై కూడా దాడికి పాల్పడ్డాడు. యువకుడి చర్యలతో విసిగిపోయిన విమాన సిబ్బంది అతికష్టం మీద అతడిని అదుపు చేసి బలవంతంగా యువకుడి చేతికి సంకెళ్లు వేసి అతడిని సీటుకు కట్టేశారు. . అనంతరం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం అందించిన విమానం కెప్టెన్.. దుబాయ్ విమానాశ్రయంలో భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. దుబాయ్‌లో విమానం దిగగానే యువకుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మరుసటి రోజే ఆ యువకుడి పేపర్లన్నీ రద్దు చేసి పాకిస్తాన్‌కు తిరిగి పంపించారు. ఆ యువకుడిని ఎయిర్‌లైన్ సంస్థ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.

Viral Video : అరుదైన అద్భుతం..కళ్లు ఆర్పిన హనుమంతుడు

కాగా,విమానం ఎక్కిన తర్వాతే యువకులను, సిబ్బందిని అతడు వేధించడం మొదలుపెట్టాడని... ఓ ప్రయాణికుడిపై కూడా ఆ యువకుడు దాడికి పాల్పడ్డాడని PIA అధికార ప్రతినిధి తెలిపారు. విమానంలో యువకుడి హంగామాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో పాకిస్తానీ యువకుడు చొక్కా లేకుండా విమానంలోని సిబ్బందితో మాట్లాడుతున్నట్లు మీరు చూడవచ్చు..ఈ క్రమంలో సడెన్ గా అతను కిటికీ వైపుకు వెళ్లి తన కాలుతో దానిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Dubai, Pakistan, Viral Video

ఉత్తమ కథలు