పప్పులో కాలేసిన పాక్ ప్రధాని.. ఆటాడుకుంటున్న నెటిజన్లు

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సరిహద్దులు పంచుకుంటున్న రెండు దేశాలు సంయుక్త పరిశ్రమలతో ఎలా అభివృద్ధి చెందాయో చెప్పే క్రమంలో ఆయన జర్మనీ, జపాన్‌లను ఉదహరించారు.

news18-telugu
Updated: April 23, 2019, 7:12 PM IST
పప్పులో కాలేసిన పాక్ ప్రధాని.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(File)
news18-telugu
Updated: April 23, 2019, 7:12 PM IST
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి పొరబడ్డారు. గతంలో ఆఫ్రికా ఖండాన్ని దేశంగా అభివర్ణించిన ఆయన సెంట్రల్ యూరప్‌లో ఉండే జర్మనీ, తూర్పు ఆసియా దేశం జర్మనీ సరిహద్దులు పంచుకుంటాయని అన్నారు. ఇరాన్ పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీతో కలిసి టెహ్రాన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సరిహద్దులు పంచుకుంటున్న రెండు దేశాలు సంయుక్త పరిశ్రమలతో ఎలా అభివృద్ధి చెందాయో చెప్పే క్రమంలో ఆయన జర్మనీ, జపాన్‌లను ఉదహరించారు. ఫ్రాన్స్, జర్మనీని ఉదహరించబోయి ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.

ఇమ్రాన్ వ్యాఖ్యలపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఈ రెండు దేశాల సరిహద్దులు కలుసుకోవని, వీటి మధ్య కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంటుందని, అది కూడా తెలియకుండా ప్రధానమంత్రి అయ్యారని, ఫ్రాన్స్ ఇప్పుడు నయా జపాన్ అయ్యిందని ఎద్దేవా చేస్తున్నారు.

ఇది కూడా చూడండి :-First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...