PAK BUYS 25 CHINESE J 10C FIGHTER JETS TO COUNTER INDIAN RAFALE WILL THESE CHINESE JETS WORK AGAINST FRENCH RAFALE GH VB
Rafales: ఇండియన్ రఫేల్‌లను ఎదుర్కోవడానికి పాకిస్థాన్ కీలక చర్య.. ఫ్రెంచ్ రాఫెల్లకు దీటుగా అవి పనిచేస్తాయా..?
ప్రతీకాత్మక చిత్రం
భారతదేశం అధునాతన ఆయుధాలను విదేశాలనుంచి సమకూర్చుకుంటుంది. ఇటీవలే భారత వాయు సేన (ఐఏఎఫ్) సామర్థ్యాన్ని బలోపేతం చేసేలా ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలను భారత్ అందుకుంది. దీంతో పాకిస్థాన్ ఉలిక్కిపడింది. వెంటనే యుద్ధవిమానాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేయడం మొదలెట్టింది.
భారతదేశం(India) అధునాతన ఆయుధాలను విదేశాల నుంచి సమకూర్చుకుంటుంది. ఇటీవలే భారత వాయు సేన (IAF) సామర్థ్యాన్ని బలోపేతం చేసేలా ఫ్రాన్స్(France) నుంచి రఫేల్(Rafales) యుద్ధ విమానాలను భారత్ అందుకుంది. దీంతో పాకిస్థాన్(Pakistan) ఉలిక్కిపడింది. వెంటనే యుద్ధవిమానాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలో తాజాగా పాక్ వైమానిక దళం (PAF) కోసం 25 చైనీస్ జే–10సీ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసినట్లు పాకిస్థాన్ ధృవీకరించింది. భారత్‌కు చెందిన రఫేల్ జెట్లకు సమాధానంగా వీటిని తమ అమ్ములపొదిలోకి చేర్చుకున్నట్లు పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్ రషీద్ వెల్లడించారు. 2022 మార్చి 23న జరిగే ఫ్లై-పాస్ట్‌లో 25 చైనీస్ స్క్వాడ్రన్ ప్రదర్శిస్తామని రషీద్ తెలిపారు.
రఫేల్స్కు సమాధానంగా చెబుతున్న జె-10సి జెట్లకు ఉన్న సామర్థ్యం ఎంత అంటే..
పీఎల్ఏ (PLA) వైమానిక దళానికి సమర్థవంతమైన వర్క్హోర్స్గా పరిగణించే జె-10సి జెట్‌కు రఫేల్ కంటే తక్కువ అధునాతన సామర్థ్యాలు ఉన్నాయి. థ్రస్ట్, షార్ట్-రేంజ్ క్షిపణుల విషయానికొస్తే జె-10సి కంటే రఫేల్స్కు స్పెషల్ అడ్వాంటేజ్. విజువల్ రేంజ్ (WVR) పోరాట సమయంలో జె-10సి కంటే ఎక్కువమందిని సంహరించగల ఫ్రెంచ్ యుద్ధవిమానం రఫేల్ కు ఉంది. మీటీయర్ మిస్సైల్ (Meteor Missile), ఆర్బీఈ2 ఏఈఎస్ఏ (RBE2 AESA) రాడార్ కలయికతో విజువల్ రేంజ్ (BVR) యుద్ధంలో జె-10సి జెట్ల కంటే చాలా మెరుగ్గా పని చేయగలదు.
I don’t understand the logic behind buying J-10C. We already have a fighter (F-16) which is in the similar class and generation. I don’t think J-10C is as good as Rafale also. We should have invested this money in building Project Azm and enhancing JF-17 capabilities. https://t.co/Dn1CpjajVS
ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ విషయంలో అత్యంత సామర్థ్యంతో నంబర్ వన్‌గా నిలుస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (PLAAF) బ్రిగేడ్లలో పాతవైన జే-7ఈ యుద్ధ విమానాల స్థానంలో జె-10సి జెట్లను చైనా ఉపయోగిస్తోంది. తైవాన్ జలసంధి, తూర్పు చైనా సముద్ర పర్యవేక్షణలో మాత్రం అధునాతన జె-20 స్టెల్త్ జెట్లపై చైనా ఆధారపడుతుంది. 2020లో చైనా-పాకిస్థాన్ జాయింట్ ఎయిర్ ఎక్సర్ సైజ్‌లలో భాగంగా ఉన్న జె-10సి.. ఇక్కడే నిపుణులకు జె-10సి ఫైటర్ జెట్‌ను పరిశీలించేందుకు అవకాశం అవకాశం దొరికింది.
రఫేల్.. ఖాళీ బరువు - 9,850 కిలోలు. థ్రస్ట్ - 100/150 kN. రాడార్ - 838 T/R మాడ్యూల్‌లతో RBE2 AESA. మిస్సైల్స్ - మీటీయర్. ఈ మీటీయర్కు ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ (AAM)గా పేరుంది. దీనిని బ్యాటిల్ ప్రూవెన్ - మాలి, అఫ్గానిస్తాన్, లిబియా, ఇరాక్ & సిరియాలో యుద్ధంలో ఉపయోగించారు. జె-10సి విషయానికి వస్తే.. ఖాళీ బరువు - 8,850 కిలోలు. థ్రస్ట్ - 79/125 kN. రాడార్ - 1,200 T/R (ట్రాన్స్మిటర్-రిసీవర్) మాడ్యూల్తో చైనీస్ AESA (యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అరే).
మిస్సైల్స్ - పీఎల్-15 మిస్సైల్. ఇది 200 కి.మీ పైగా పరిధితో పనిచేసే డ్యూయల్-స్టేజ్ బియాండ్-విజువల్-రేంజ్ (BVRAAM) మిస్సైల్. రష్యన్ భాగాలను ఉపయోగించే దీని మెయింటెనెన్స్ కష్టంతో కూడుకున్నది. యుద్ధంలో ఇప్పటివరకు యూజ్ చేయలేదు.
జె-10సి ప్రభావం చూపుతుందా..?
సింగిల్ ఇంజిన్ కలిగి ఉండే జె-10సి అనేది ఓ తేలికపాటి మల్టీరోల్ ఫైటర్... వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగల సామర్థ్యం దీని సొంతం. స్ట్రైక్ మిషన్లు, ఎయిర్-టు-ఎయిర్ వార్ఫేర్ కోసం జె-10సి రూపొందించిన పీఎల్ఏ(PLA) ఎయిర్ ఫోర్స్.. ఫ్రెంచ్ మిరాజ్ యుద్ధ విమానాల మాదిరిగానే భారీ డెల్టా వింగ్‌ను కలిగి ఉంది. ఈజీగా మలుపులు తిరిగేందుకు కాక్‌పిట్ వెనుక రెండు కానార్డ్‌లు కలిగి ఉంటుంది.
MiG-29, F-16 మాదిరిగానే జె-10 ఆయుధ పేలోడ్ ఉంటుంది. J-10 పేలోడ్‌లో ప్రతి రెక్కపై మూడు, మధ్యలో మరో మూడు ఆయుధ స్తంభాలు(pylons) ఉంటాయి. కొత్త చైనీస్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను భగ్నం చేయగల సామార్థ్యం జె-10సి కు ఉంది. అనేక అధునాతన లాంగ్-రేంజ్ యాక్టివ్-రాడార్ హోమింగ్ డిజైన్లను కూడా పేల్చేయగల సామార్థం ఉంది.
జె-10సి స్వాధీనం గురించి ప్రశ్నించిన పాక్ సెనేటర్..
జె-10సి కొనుగోలు వెనుక ఉన్న లాజిక్‌ను పాకిస్థాన్ ప్రముఖ సెనేటర్, డాక్టర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్ ప్రశ్నించారు. ఎఫ్-16ను ప్రస్తావిస్తూ జె-10 తరహాలో పాకిస్థాన్‌కు ఇప్పటికే విమానం ఉందని వ్యాఖ్యానించారు. ఐఏఎఫ్ తో సేవలో ఉన్న రఫేల్‌ల వలె జె-10సి మంచిదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రఫేల్స్పై పాక్ ప్రస్తుత ఫైటర్ ఫ్లీట్ ఎలా పోరాడుతుంది..
అమెరికా తయారు చేసిన ఎఫ్-16 విమానాల సముదాయాన్ని పాకిస్థాన్ కలిగి ఉందని, ఇది రఫేల్‌కు మంచి మ్యాచ్‌గా అని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం JF-17 థండర్‌తో పాటు తక్కువ రైడర్లతో పాటు F-16లను పాక్ నడుపుతోంది. JF-17 అనేది పాకిస్థాన్, చైనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన తేలికపాటి, సింగిల్-ఇంజిన్ మల్టీ-రోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్.
JF-17 యుద్ధవిమానాల ఇంజన్ నల్లటి పొగను విడుదల చేయడంతో సమస్యలను పాకిస్థాన్ ఎదుర్కొంటుంది. JF-17 ఎగ్జాస్ట్ శత్రువులకు సులువైన లక్ష్యాన్ని చేయగలదని నిపుణులు అంటున్నారు. భారత యుద్ధ విమానాలతో డాగ్‌ఫైట్‌లో IAF రఫేల్ JF-17 థండర్‌ను సులభంగా అంతం చేయగలదు. J-10C మాత్రమే పాకిస్తాన్‌కు మిగిలి ఉన్న ఏకైక ఎంపిక అని పేర్కొన్న నివేదికలు పేర్కొంటున్నాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.