PACIFIC FOOTBALL FISH A SPOOKY FINDING NEMO FISH WASHES UP ON CALIFORNIA BEACH SK GH
Football Fish: 'ఫైండింగ్ నీమో' మూవీ చూశారా? అచ్చం అలాంటి చేపే ఇది.. ఒడ్డుకు కొట్టుకొచ్చింది
ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేప ఇదే
మత్స్యకారుడు బెన్ ఎస్టెస్ ఈ చేపను ముందుగా చూసి అధికారులకు తెలియజేశారు. ఇలాంటి చేపను నా జీవితకాలంలో ఎప్పుడూ చూడలేదని, ఇది అసాధారణమైన చేపని ఆయన అభివర్ణించారు.
సముద్రాల్లో అప్పుడప్పుడు కొన్ని అరుదైన చేపలు బయటపడుతుంటాయి. వీటిని చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతుంటాం. తాజాగా కాలిఫోర్నియా బీచ్‌లో ఇటువంటి ఒక అరుదైన చేప ఒడ్డుకు కొట్టుకొచ్చింది. తెరుచుకున్న నోటిలో సన్నని సూదుల్లాంటి దంతాల వరుస.. తల మీద నుంచి ముందుకు వాలిన కుచ్చుల చెర్నాకోల లాంటి తోక.. ఆ తోకలో కాంతిని ప్రసరించే లైటు.. ఇదీ తాజాగా కాలిఫోర్నియా బీచ్ తీరానికి కొట్టుకొచ్చిన ఫుట్‌బాల్ ఆకారంలోని చేప. హాలీవుడ్ చిత్రం ‘ఫైండింగ్ నీమో’లో కనిపించిన ఓ చేప మాదిరిగా ఇది మనకు దర్శనమిస్తుంది. సముద్రపు లోలోతుల్లో జీవించే ఈ అరుదైన చేప కాలిఫోర్నియా తీరానికి కొట్టుకురావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. క్రిస్టల్ కోవ్ అనే చోట ఇది నిర్జీవ స్థితిలో కనిపించింది.
మత్స్యకారుడు బెన్ ఎస్టెస్ ఈ చేపను ముందుగా చూసి అధికారులకు తెలియజేశారు. ఇలాంటి చేపను నా జీవితకాలంలో ఎప్పుడూ చూడలేదని, ఇది అసాధారణమైన చేపని ఆయన అభివర్ణించారు. దీనిపై మత్స్య నిపుణురాలు జెస్సికా రోయమ్ మాట్లాడుతూ ‘‘ఆంగ్లర్ ఫిష్ జాతికి చెందిన ఈ చేప చెక్కుచెదరకుండా ఉంది. 3,000 అడుగుల (914 మీ) లోతున జీవించే ఈ చేప తీరానికి ఎలా వచ్చిందో తెలియడం లేదు’’ అని పేర్కొన్నారు. అంత లోతులో జీవించే ఈ చేప బయటపడటం అరుదైన విషయమే. దీనిపై క్రిస్టల్ కోవ్ స్టేట్ పార్క్ అధికారి స్పందిస్తూ ‘‘అసలు ఆంగ్లర్‌ఫిష్ చెక్కుచెదరకుండా చూడటం చాలా అరుదు. చాలా లోతుల్లో జీవించే ఈ చేపలు ఇలా ఎందుకు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయో తెలియడం లేదు" అని అన్నారు.
చాలా అరుదైన చేప..
బీచ్‌లో బయటపడ్డ ఈ ఫుట్‌బాల్ చేపను కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ స్వాధీనం చేసుకుంది. దాన్ని ఫ్రీజ్ చేసి లాస్ ఏంజెల్స్ కౌంటీ నేచురల్ హిస్చరీ మ్యూజియంకు తరలించింది. అయితే, ఆ మ్యూజియంలో ఇదివరకే మూడు ఆంగ్లర్ ఫిష్ జాతి చేపలున్నప్పటికీ, ఒక్క చేప కూడా ఇంతటి చెక్కుచెదరని స్థితిలో లేదని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి చేపలు చాలా అరుదుగా బయటపడతాయని, వీటిని చూసినప్పుడు ఆశ్చర్యం కలగక మానదని లాస్ ఏంజెల్స్ కౌంటీ నేచురల్ హిస్చరీ మ్యూజియం ఒక పోస్ట్‌లో పేర్కొంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.