• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • OXFORD ENGLISH DICTIONARY FAILS TO PICK ONE WORD OF THE YEAR NS GH

Oxford Dictionaryకే సవాల్ విసిరిన 2020.. ఈ ఏడాది ఆ పని చేయలేమన్న సంస్థ.. అసలు ఏమైందంటే..

Oxford Dictionaryకే సవాల్ విసిరిన 2020.. ఈ ఏడాది ఆ పని చేయలేమన్న సంస్థ.. అసలు ఏమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచ వ్యాప్తంగా ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఎంతో ప్రసిద్ధి చెందిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంగ్లీష్ పదాలను సంకలనం చేసే ఆ డిక్షనరీ ఈ ఏడాది ఆ సంస్థ ఓ పని చేయలేమని చెప్పింది. అది ఏంటంటే..

  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇంగ్లీష్ పదాలను సంకలనం చేసే ఆ డిక్షనరీ, ఈ సంవత్సరానికిగానూ వర్డ్ ఆఫ్‌ ద ఈయర్‌ను ఎంచుకోలేకపోయింది. ఇలా గుర్తించలేకపోవడం ఇదే మొదటిసారి. ప్రతీ సంవత్సరం ఎక్కువగా ప్రాచుర్యం పొందిన, కొత్తగా వాడుకలోకి వచ్చిన ఇంగ్లిష్ పదాలను ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ వర్డ్ ఆఫ్‌ ద ఈయర్‌గా గుర్తిస్తుంది. ఈ సంవత్సరం అనేక కొత్త పదాలు వాడుకలోకి వచ్చినందున వాటి నుంచి ఒకే ఒక్క పదాన్ని ఎంచుకోలేకపోయామని ఆ సంస్థ తెలిపింది. 2020కి సంబంధించిన ఒకే ఒక్క పదానికి డిక్షనరీలో చోటు కల్పించలేమని ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన బుష్‌ ఫైర్స్‌ నుంచి కొత్త పదాల వాడకం మొదలైంది. బుష్‌ఫైర్స్‌ కొన్ని లక్షల మంది ప్రజలను, వన్యప్రాణులను ప్రభావితం చేసింది. ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన సందర్భంగా నిర్దోషి అనే అర్థం వచ్చే "acquittal" పదం వాడకం బాగా పెరిగింది.

మహమ్మారి నేర్పిన కొత్త పదాలు
కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని మూలలకు పాకిన తరువాత "COVID-19", "lockdown", "social distancing", "reopening" వంటి పదాలు ఇంతకు ముందుకంటే ఎక్కువగా వాడుకలోకి వచ్చాయి. ఆ తరువాత అమెరికాలో నల్ల జాతీయులపై వివక్ష, ఆఫ్రికన్-అమెరికన్ సమాజంపై పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సందర్భంలో కొత్తగా "Black Lives Matter", "BIPOC" పదాలు కొత్తగా వినిపించాయి. ఆ తరువాత ట్రంప్‌ వైఖరిపై విమర్శలు గుప్పిస్తూ "cancel culture" అనే పదాన్ని ప్రజలు ఎక్కువగా వాడారు.

అమెరికా నుంచి మరికొన్ని పదాలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి మెయిల్ ఇన్ ఓటింగ్ సిస్టమ్‌లో అవకతవకలు ఉన్నాయని ట్రంప్ చెప్పినప్పుడు "Mail-in" అనే పదం ఆగస్టులో ఎక్కువగా వినిపించింది. ఆ తరువాత బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోపై వచ్చిన వివాదాల నేపథ్యంలో "Belarusian" పదం వాడకం పెరిగింది. వైట్‌హౌస్‌లో సూపర్‌స్ప్రెడర్ ఈవెంట్‌ను నిర్వహించినందుకు అక్టోబర్ నెలలో ట్రంప్‌ను ప్రజలు నిందించారు. ఆ నెలలో "superspreader" అనే పదాన్ని ప్రజలు ఎక్కువ సార్లు వాడారు.

ఒక్క పదాన్ని ఎంచుకోలేక..
2020 సంవత్సరానికిగానూ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ తయారు చేసిన నివేదికకు 'Words of an Unprecedented Year' అని పేరు పెట్టారు. ఈ సంవత్సరం ఉపయోగించిన ఎడ్జెక్టివ్స్‌ (adjectives) సంఖ్య భారీగా పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. "ఈ సంవత్సరం అనేక కొత్త పదాలు వాడుకలోకి వచ్చాయి. నెలల వారీగా కొత్త పదాల వాడకం పెరిగింది. కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు చాలా పదాలు వెలుగులోకి వచ్చాయి. వాటి వాడకం కూడా పెరిగింది. అందువల్ల వర్డ్ ఆఫ్ ద ఈయర్‌ను గుర్తించలేకపోతున్నాం" అని ఆక్స్‌ఫర్డ్ రిపోర్ట్‌లో ఉంది. 2018లో "toxic" అనే పదాన్ని, 2019 సంవత్సరానికి "climate emergency" అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఈయర్‌గా ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ గుర్తించింది.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు