మనుషుల్లో కొందరి వింత పోకడలు, విచిత్రమైన చేష్టలు, ఇష్టా,ఇష్టాలు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. కొందరికి ఏంటీ విచిత్రం అని ముక్కు మీద వేలు వేసుకునే విధంగా తయారవుతున్నాయి. హర్యానాHaryanaలో కుక్కల పెళ్లే Dog weddingఇందుకు ఉదాహరణ. ముద్దుగా పెంచుకున్న ఆడ కుక్కకు పొరుగింట్లో ఉంటున్న మగ కుక్కతో వివాహం చేశారు. ఆ పెళ్లి వేడుకు ఎంత ఘనంగా జరిపారు..? ఎంత మంది అతిథులు హాజరయ్యాయో తెలిస్తే ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఆ పెట్ వెడ్డింగ్Pet wedding వీడియో(Video) సోషల్ మీడియా(Social media)లో వైరల్ (viral)అవుతోంది. ఇదేం అలవాటు, ఇదే విడ్డూరం అని అందరు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
కుక్కల వివాహం చూతమురారండి..
హర్యానా గుర్గావ్లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. షేరు, స్వీటీల పెళ్లి వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు ఇరువర్గాల పెద్దలు. దాదాపు 300మంది మహిళా ముత్తైదువులతో పాటు బంధువులు, స్థానికులు ఈ పెళ్లి వేడుకకు హాజరై జంటను ఆశీర్వదించారు. ఇంతకీ బంధు,మిత్రుల సమక్షంలో ఒక్కటైన జంట ఎవరో కాదు పెంపుడు కుక్కలు. స్వీటీ అనే ఆడకుక్క యజమాని పొరుగు ఇంట్లో పెంచుకుంటున్న షేరు అనే కుక్కతో వివాహం చేయడానికి నిర్ణయించారు. ఈనెల 13వ తేదిన జరిగిన వెడ్డింగ్‌కి గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసారు.
#WATCH via ANI Multimedia | ‘Sheru weds Sweety; Neighbourhood comes alive amid ‘furry’ wedding festivities in Gurugram, Haryana.https://t.co/60mW9P4V5d
— ANI (@ANI) November 14, 2022
గ్రాండ్ వెడ్డింగ్ ..
ముందు రోజు మెహందీ ఫంక్షన్, ఆ తర్వాత హల్దీ కార్యక్రమంతో పాటు పెళ్లికి వివాహ ఆహ్వాన పత్రికలు ముద్రించి అందరికి పంచారు. సంప్రదాయ, ఆచారం ప్రకారం ఆడ కుక్క మెడలో మగ కుక్కతో మూడు ముళ్లు వేయించారు. బంధు,మిత్రులతో పాటు స్థానికుల సమక్షంలో ఇద్దరు పెట్ డాగ్స్ యజమానులు గ్రాండ్‌గా పెళ్లి చేశారు.
ఆశ్చర్యపోతున్న స్థానికులు..
వివాహం జరిగిన తర్వాత బారాత్ కూడా నిర్వహించారు. డ్యాన్సులు, ఆట, పాటలతో అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు. పెళ్లికి హాజరైన ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. శునకాలకు కూడా ఇంత ఘనంగా వెడ్డింగ్ నిర్వహించడం గొప్ప విషయమని అభినందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Haryana, Pet dog, Viral Video