• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • OWNERS ANNOUNCE A REWARD OF RS 10000 FOR MISSING PARROT IN UP ALIGARH SK

Parrot Missing: ఈ చిలుక ఎక్కడైనా కనిపించిందా? వెతికి పెడితే రూ.10 వేలు రివార్డ్

Parrot Missing: ఈ చిలుక ఎక్కడైనా కనిపించిందా? వెతికి పెడితే రూ.10 వేలు రివార్డ్

ఈ చిలుక ఎక్కడైనా కనిపించిందా? వెతికి పెడితే రూ.10వేలు

3 రోజులు గడిచినా చిలుక ఆచూకీ గురించి తెలియకపోవడంతో.. సౌమ్య కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఎక్కువయింది. ఈ క్రమంలోనే చిలుక మిస్సింగ్ గురించి 400 కరపత్రాలు ముద్రించి.. స్థానికంగా పంచి పెడుతున్నారు. తమ చిలుకను వెతికి పెట్టిన వారికి రూ.5 నుంచి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు.

  • Share this:
    కొందరికి జంతువులు, పక్షులంటే ఎంతో ఇష్టం. ఇంట్లో కుక్కలు, కుందేళ్లు, చిలుకలు, పావురాలు వంటి ప్రాణులను పెంచుకుంటారు. వాటిని ఇంట్లో మనిషిలా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కన్న బిడ్డలా కాపాడుకుంటారు. మరి ఎన్నో ఏళ్లుగా అపురుపూకంగా చూసుకుంటున్న ఈ జీవులు ఒక్కసారిగా కనిపించకుండా పోతే.. ఆ ఇంటి యజమాని ఎంతో కంగారుపడిపోతాడు. కన్న బిడ్డే పోయినంతగా బాధపడతాడు. యూపీలో ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదరయింది. తాను అల్లారుముద్దుగా పెంచుకున్న చిలుక కనిపించకుండా పోయింది. ఐతే అందరిలా బాధపడుతూ ఆయన వదిలేయలేదు. తన చిలుక కోసం ఏకంగా రివార్డ్ ప్రకటించాడు. తన చిలుక గురించి సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తానని బంఫర్ ఆఫర్ ఇచ్చాడు. కరపత్రాలు ముద్రించి అందరికీ పంచుతున్నాడు.

    యూపీలోని అలీగఢ్ జిల్లాకు చెందిన సౌమ్య వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరికీ జంతువులు, పక్షులంటే ప్రాణం. ఈ క్రమంలోనే సౌమ్య ఏడాదిన్నర క్రితం బెంగళూరు నుంచి ఆప్రికన్ బ్రీడ్ చిలుకను తెప్పించుకుంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి చిలకను ఇంటికి తెచ్చుకుంది. ఆరు నెలల తర్వాత సౌమ్య, తన భర్తతో కలిసి లండన్ వెళ్లిపోయింది. అప్పటి నుంచీ చిలుక బాగోగులను ఆమె అత్తామామలు చూసుకునేవారు. ఐతే మార్చి 2 నుంచి ఆ చిలుక కనిపించాకుండాపోయింది. చుట్టు పక్కల ఎంత వెతికినా దొరకలేదు. తిరిగి అది ఇంటికి రాలేదు.

    చివరకు సౌమ్య తండ్రి వర్ష్నే, ఆమె అత్త మార్చి 3న ఖార్సీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ చిలుక కనిపించకుండా పోయిందని మిస్సింగ్ కేసు పెట్టారు. తమ చిలుక ఆఫ్రికన్ బ్రీడ్ అని.. శరీరం బూడిద రంగు, తోక ఎరుపు రంగులో ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాని పేరు విస్కీ అని.. మనుషుల్లా మాట్లాడగలదని చెప్పారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు ఇచ్చి 3 రోజులు గడిచినా చిలుక ఆచూకీ గురించి తెలియకపోవడంతో.. సౌమ్య కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఎక్కువయింది. ఈ క్రమంలోనే చిలుక మిస్సింగ్ గురించి 400 కరపత్రాలు ముద్రించి.. స్థానికంగా పంచి పెడుతున్నారు. తమ చిలుకను వెతికి పెట్టిన వారికి రూ.5 నుంచి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. అటు పోలీసులు కూడా చిలుక కోసం గాలిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు