Owner of 100 crores rupees lost everything : అదృష్టం ఎప్పుడు తిరుగుతుందో చెప్పలేం. కాలం బాగుంటే, అదృష్టం ఒక్క క్షణంలో ధనవంతులను చేస్తుంది, కానీ సమయం చెడుగా ఉంటే, అదృష్టం మిమ్మల్ని మరుసటి క్షణంలో బిచ్చగాణ్ణి చేస్తుంది. అకస్మాత్తుగా 100 కోట్లకు యజమాని అయిన ఒక వ్యక్తికి ఇలాంటిదే జరిగింది. ఒక వ్యక్తి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగకుండా, చేతికి వచ్చిన డబ్బును పొదుపుగా కాకుండా, సరదాగా ఖర్చు చేస్తే, అతని పరిస్థితి బ్రిటన్(Britain) నివాసి జాన్ మెక్‌గిన్నిస్ లాగా ఉంటుంది. ది సన్ నివేదిక ప్రకారం, జాన్ తన అదృష్టం బలంతో కోట్లు సంపాదించాడు, కానీ ఇప్పుడు అతని పరిస్థితి మెత్తం తల్లకిందులైపోయింది.
బ్రిటన్ నివాసి జాన్ మెక్‌గిన్నిస్‌కు.. 1997 సంవత్సరంలో రూ. 100 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతని లైఫ్ స్టైయిల్ మారింది. డబ్బులను ఎడాపెడా ఖర్చు చేయడం మొదలెట్టాడు. బెంట్లీ, మెర్సిడెస్, జాగ్వార్, ఫెరారీ, బీఎండబ్ల్యూ మోడళ్ల కార్లను కొనుగోలు చేశాడు. రూ.13 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాను సొంతం చేసుకున్నాడు. ఇది కాకుండా, 5 కోట్ల విలువైన సీఫేసింగ్ అపార్ట్‌మెంట్ కొన్న తర్వాత, అతను తన కుటుంబం కోసం దాదాపు 30 కోట్లు ఖర్చు చేశాడు. పక్కా ప్రణాళిక లేకుండా డబ్బు పెట్టుబడి పెట్టడంతో లాటరీ సొమ్ముతో కూడబెట్టినదంతా పోగొట్టుకున్నట్లు తెలిసింది.
Sperm factory: చైనాలో స్పెర్మ్ ఫ్యాక్టరీ..అక్కడ ఏం జరుగుతుందే తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
సన్ పత్రికతో జాన్ మాట్లాడుతూ.. తాను లగ్జరీ కార్లను కొనుగోలు చేయడమే కాకుండా అనేక విలాసవంతమైన ప్రదేశాలలో సెలవులు గడిపానని చెప్పాడు. విలాసవంతమైన జీవితం గడపడం కోసమే గెలిచిన డబ్బు అంతా వృధా చేశానని ఒప్పుకున్నాడు కానీ ఇప్పుడు షాపింగ్ బిల్లులు ఎలా చెల్లిస్తాడోనని భయపడుతున్నాడు. ఒకప్పుడు కేవలం డిజైనర్ బట్టలే వేసుకుని, విలాసవంతమైన సెలవుల్లో కోట్లకు పడగలెత్తిన జాన్.. పేదవాడిగా మారాడని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.