Video : సీక్రెట్ కెమెరాని కనిపెట్టేసిన గుడ్లగూబలు... ఏం చేశాయంటే...

Owls and Camera : పరిశోధకులు ఒకటి తలిస్తే... జరిగింది మరొకటి అయ్యింది. గుడ్లగూబలు కూడా మనుషుల్లాగే ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగించింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 9, 2019, 7:07 AM IST
Video : సీక్రెట్ కెమెరాని కనిపెట్టేసిన గుడ్లగూబలు... ఏం చేశాయంటే...
కెమెరా వైపు చూస్తున్న గుడ్లగూబలు (Image : Twitter - Reuters)
Krishna Kumar N | news18-telugu
Updated: August 9, 2019, 7:07 AM IST
మనకు తెలియకుండా ఎవరైనా మన చుట్టుపక్కల సీక్రెట్ కెమెరా పెడితే మనం ఏం చేస్తాం... "ఎవడ్రా ఇది ఇక్కడ పెట్టింది" అంటూ దాన్ని తీసిపారేస్తాం. అవసరమైతే నేలకేసి కొడతాం. దాన్ని చూసినప్పుడు మనకి వచ్చే కోపాన్ని బట్టీ మన రియాక్షన్ ఉంటుంది. ఈ విషయంలో గుడ్లగూబలు కూడా ఇలాగే రియాక్ట్ అవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అరుదైన గుడ్లగూబల్ని పరిశోధించే ఉద్దేశంతో... సైంటిస్టులు... ఓ సీక్రెట్ కెమెరాను... వాటి గూడు దగ్గర సెట్ చేశారు. ఆ తర్వాత ఆ గూడు లోంచీ రెండు గుడ్లగూబలు బయటకు వచ్చాయి. ఎప్పుడూ లేనిది... అక్కడ ఏదో వస్తువు ఉన్నట్లు అనిపించడంతో... గుడ్లగూబలు కంగారు పడ్డాయి. తమను బంధించేందుకు ఎవరో ఏదో అక్కడ పెట్టారని టెన్షన్ పడుతూ.. కెమెరా దగ్గరకు వచ్చి... దాని లెన్స్‌లో కళ్లు పెట్టి చూసి... "అయ్యబాబోయ్" అనుకున్నాయి. వెంటనే ఆ కెమెరాను కాలితో తన్నాయి. అంతే... ఏదో షూట్ చేద్దామనుకుంటే... ఈ చిత్రమైన వీడియో షూట్ అయ్యింది.


ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వాటికీ ప్రైవసీ ఇవ్వాలని ఓ ట్విట్టర్ యూజర్ స్పందించగా... అవి కూడా మనలా ఆలోచించగలగడం ఆశ్చర్యమే అన్నారు మరో యూజర్. ఇలా నెటిజన్లు తమకు తోచిన కామెంట్లు పెడుతున్నారు.

First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...