Ranu Mondal: ఎక్కడ మొదలైందో అక్కడికే.. రణు మండల్ కు మళ్లీ కష్టాలు

ఒకే ఒక్క పాటతో ఇంటర్నెట్ సంచలనం అయింది. బాలీవుడ్ లో పెద్ద సంగీత దర్శకుడు అవకాశమిచ్చాడు. బతుకు బాగుపడుతుందనుకుంటున్న సమయంలో ఊహించిన మలుపు. అంతే.. తిరిగి యథాస్థితికి చేరుకుంది రణు మండల్.

news18
Updated: October 12, 2020, 7:40 PM IST
Ranu Mondal: ఎక్కడ మొదలైందో అక్కడికే.. రణు మండల్ కు మళ్లీ కష్టాలు
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 12, 2020, 7:40 PM IST
  • Share this:
విధి బలీయమైంది. అది ఎవర్ని.. ఎక్కడ.. ఎలాంటి పరిస్థితుల్లో ఉంచుతుందో ఎవరూ ఊహించలేరు. ఇంటర్నెట్ యుగంలో ఓవర్ నైట్ స్టార్లు అయిన చాలా మంది జీవితం చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. ఒకే ఒక్క పోస్టుతోనో, వీడియోతోనో సంచలనమైపోయి.. దానిని నిలబెట్టుకుని ముందుకు సాగేవాళ్లు కొంతమందైతే.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక అహం తలకెక్కి చతికిలపడినవారెందరో. పనస పండంతా ట్యాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా కలిసిరావాలి. లేకుంటే జీవితాలు తలకిందులైతాయి. రణు మండల్ లా..

ఇంతకీ రణు మండల్ ఎవరనుకుంటున్నారా..? అదేనండి.. ఒకే ఒక్క పాటతో ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించిన గాయని. ఆ పాటతో అప్పటిదాకా ఆమె వీధి దాటి తెలియని పేరు.. ఏకంగా దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. బెంగాల్ లోని రాణాఘాట్ రైల్వేస్టేషన్ వద్ద యాచకురాలుగా ఉన్న ఆమె.. ఒక సందర్భంలో లతా మంగేష్కర్ పాడిన పాటను ఒక నెటిజన్ వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పెట్టారు. ఇంకేం.. బాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టినట్టే వచ్చాయి. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు.. అన్నీ వచ్చాయి. బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా కూడా.. తాను నటించి కంపోజ్ చేసిన ‘తేరీ మేరీ కహానీ’లో మూడు పాటలు పాడించారు. హిమేష్ తో కలిసి ఆమె పాడిన పాట.. ‘తేరీ.. మేరీ.. తేరి మేరి కహానీ’ పాట ఒక ఊపు ఊపింది.

రాత్రికి రాత్రి సంచలనమైన రణు మండల్ కు ఒక్కసారిగా అవకాశాలు రాకపోవడంతో ఆమె వైఖరిలోనూ మార్పులు కనిపించాయి. అంతకుముందు ఆమె ఇంటిని మార్చి కొత్త ఇంటిని కొన్న మండల్.. పలు ఫంక్షన్లకు వెళ్లే సమయంలో ఆమె వేసుకున్న మేకప్ ను చూసి నెటిజన్లు విమర్శలు చేశారు. ఇక తనను సెల్ఫీ అడిగిన ఒక అభిమానిపై ఆమె వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమైంది.

అడపా దడపా అవకాశాలు వచ్చినా.. ఇదే క్రమంలో దేశంలో కరోనా రాకతో దేశం లాక్డౌన్ అయింది. ఇక అప్పట్నుంచి రణు మండల్ కు పని కరువైంది. సినిమాలు లేవు. షో లు లేవు. డబ్బు లేదు. తిరిగి వెళ్దామా అంటే వెళ్లలేని పరిస్థితి. ఇక ఒక్కరోజులో ఆమెకు వచ్చిన ఫేమ్ కారణంగా కరోనా కాలంలో కొంతమందికి బియ్యం, సరుకులు సాయం చేసింది. కానీ రాను రాను ఉన్న డబ్బులు అయిపోసాగాయి.

ranu mondal, internet sensation, music, bengal news, himesh reshmiya, bollywood songs, teri meri kahani

కాల చక్రం గిర్రున తిరిగింది. దాదాపు తొమ్మిదినెలలుగా సినిమాలు లేక ఎంతో కొంత నిలదొక్కుకున్న దర్శకులు, నటులే స్వంత ఊర్లకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. కానీ రణుమండల్ కు స్వంత ఆస్తులంటూ ఏమీ లేవు. అంతే.. ఆమె మళ్లీ యథాస్థితికి చేరుకుంది. ఇక తన వైఖరిలో వచ్చిన మార్పుల కారణంగా మండల్ దగ్గరకు రావడానికి కూడా ఎవరూ సాహసించడం లేదని సమాచారం. ప్రస్తుతం ఆమె దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని.. ఇంటర్నెట్ లో కనిపించక ముందు ఎలా ఉందో అలాగే ఉన్నదని తెలుస్తున్నది. ఎక్కడ మొదలైందో మళ్లీ అక్కడికి వెళ్లింది మండల్. మళ్లీ ఆమెకు కష్టాలు తప్పేలా లేవు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు పెద్దలు. దానిని మరిచిన వాళ్లు ఎంతటివాళ్లైనా చివరికి మళ్లీ పూర్వస్థితికి వెళ్లాల్సిందే. చరిత్ర చెబుతున్న పాఠమిదే.
Published by: Srinivas Munigala
First published: October 12, 2020, 7:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading