సంచలనం.. మాల్యా, ఛోక్సీ రుణాలను మాఫీ చేసిన ఆర్బీఐ.. ఎన్ని వేల కోట్లంటే..

దేశంలో బ్యాంక్ డిఫాల్టర్లలో 50 మంది రుణాలను మాఫీ చేసింది ఆర్బీఐ. ఆ మొత్తం ఎంతో తెలుసా.. అక్షరాలా.. రూ.68 వేల కోట్లు.

news18-telugu
Updated: April 29, 2020, 9:39 AM IST
సంచలనం.. మాల్యా, ఛోక్సీ రుణాలను మాఫీ చేసిన ఆర్బీఐ.. ఎన్ని వేల కోట్లంటే..
విజయ్ మాల్యా
  • Share this:
ఇల్లు కోసం ఓ సామాన్యుడు బ్యాంక్ లోన్ తీసుకుంటే అతడి వద్ద ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తాయి బ్యాంకులు. ఫైన్ల మీద ఫైన్లు వేసి వెన్ను విరుస్తాయి. కట్టలేని పరిస్థితిలో ఉంటే పైసా మాఫీ చేయని బ్యాంకుల.. వేల కోట్లు తీసుకొని పంగ నామాలు పెడుతున్న బడాబాబులకు మాత్రం రుణమాఫీ చేసేస్తున్నాయి. తాజాగా.. దేశంలో బ్యాంక్ డిఫాల్టర్లలో 50 మంది రుణాలను మాఫీ చేసింది ఆర్బీఐ. ఆ మొత్తం ఎంతో తెలుసా.. అక్షరాలా.. రూ.68 వేల కోట్లు. అందులో బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి పారిపోయిన విజయ్ మాల్యా, డైమండ్స్ టైకూన్ మెహుల్ ఛోక్సీ ఉన్నారు. సాంకేతికంగా బ్యాంకులు వీళ్ల రుణాలను మాఫీ చేశాయి. రుణ మాఫీ చేసిన కంపెనీల్లో రూ. 5,492 కోట్ల రూపాయలతో గీతాంజలి జెమ్స్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆర్‌ఇఐ ఆగ్రో, రూ .4,314 కోట్లు, విన్సమ్ డైమండ్స్ అండ్ జువెల్లరీ రూ. 4,076 కోట్లు. బాబా రాందేవ్ అండ్ బాల‌కృష్ణ గ్రూప్ కూడా ఈ జాబితాలో ఉంది. ఆ కంపెనీకి రూ.2212 కోట్లు మాఫీ అయ్యాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రూ. 1,943 కోట్ల రుణాలను మాఫీ చేసింది ఆర్బీఐ.

ఆర్టీఐ యాక్టు కింద రుణాల మాఫీ వివరాలను కోరగా ఆర్బీఐ ఈ వివరాలను అందించింది. రాహుల్‌ గాంధీ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చేందుకు విముఖత చూపడంతో సాకేత్ గోఖలే ఆర్టీఐ ద్వారా అర్జీ పెట్టుకున్నారు. దీంతో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి.

Published by: Shravan Kumar Bommakanti
First published: April 29, 2020, 9:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading