OVER 5000 CRORES BIRDS ON THIS EARTH SIX TIMES MORE THAN HUMANS HERE IS INTERESTING FACTS GH SK
Population: భూమి మీద మనుషుల కంటే వీటి జనాభానే ఎక్కువ... ఏకంగా 5000 కోట్ల పైనే..
ప్రతీకాత్మక చిత్రం
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్వేల్కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచంలో 7.8 బిలియన్ల మంది మనుషులుంటే, పక్షులు మాత్రం 50 బిలియన్లు ఉన్నట్లు గుర్తించారు.
అందమైన పక్షుల కిలకిలరావాలతో ప్రతి ఉదయం ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ పక్షులను ఇష్టపడతారు. అయితే ఎప్పుడైన ఈ భూమి మీద ఎన్ని పక్షులు జీవిస్తున్నాయో ఆలోచించారా? ఈ వివరాలు తెలిస్తే నిజంగా షాకవుతారు. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో.. ప్రపంచంలో 5000 కోట్ల పక్షులు నివసిస్తున్నట్లు తెలిసింది. ఈ సంఖ్య భూమి పైన నివసించే మనుషుల కంటే ఆరు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్వేల్కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచంలో 7.8 బిలియన్ల మంది మనుషులుంటే, పక్షులు మాత్రం 50 బిలియన్లు ఉన్నట్లు గుర్తించారు.
ఈ అధ్యయనంలో ఎగరలేని ఈమూలు, పెంగ్విన్స్తో సహా 9,700 రకాల పక్షి జాతుల జనాభాను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి జాతి పక్షుల సంఖ్యను విశ్లేషించి, ఫలితాలను లెక్కకట్టారు. మొత్తం పక్షుల సంఖ్యలో 92% సజీవంగా ఉన్నట్లు అధ్యయనం తేల్చింది. ఈ స్టడీలో ఆరు లక్షలకు పైగా పౌరశాస్త్రవేత్తల నుంచి సమాచారం సేకరించారు. 2010 నుంచి 2019 వరకు ఈ-బర్డ్ డాటాసెట్లో నమోదైన సమాచారాన్ని పరిశోధనకు ఆధారంగా తీసుకున్నారు. పక్షులకు సంబంధించి ఇలా పెద్ద స్థాయిలో సేకరించిన సమాచారాన్ని అనుసంధానించడం ఇదే మొదటిసారి. ఇలాంటి చర్య ఇతర జంతువులను లెక్కించడానికి బ్లూ ప్రింట్గా పనిచేస్తుందని చెబుతున్నారు పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ కోరీ కల్లఘన్.
ప్రపంచ పక్షుల సంఖ్యలో సుమారు 12% పక్షుల రకాలు 5000 కంటే తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి జాతుల్లో చైనీస్ క్రిస్టెడ్ టర్న్, శబ్ధం చేసే క్రబ్ బర్డ్, ఇన్విజిబుల్ రైల్ ఉన్నాయి. ఐదు, పది సంవత్సరాల్లో మరోసారి పక్షుల గణన చేయడం ద్వారా ఈ జాతులు ఎంత సంఖ్యలో ఉంటాయో చెప్పగలరని ప్రొఫెసర్ కార్న్వెల్ తెలిపారు. ఒకవేళ, అప్పటికి వాటి సంఖ్య తగ్గితే అది మన పర్యావరణ వ్యవస్థకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడినట్లేనని అంటారాయన. ఈ అధ్యయనంలో ఆస్ట్రేలియాకు చెందిన అరుదైన పక్షిజాతుల్లో భారీ క్షీణత ఉన్నట్లు సూచనలు కనిపించాయి. ఇలాంటి జాతుల్లో 100 మాత్రమే మిగిలి ఉన్న నల్ల-ఛాతి బటన్క్వాయిల్ పక్షులు కూడా ఒకటి.
Keywords:
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.