Home /News /trending /

OVER 100 PEOPLE FALL ILL AFTER EATING PANI PURI IN WEST BENGALS HOOGHLY DIARRHOEA SUSPECTED PAH

కొంప ముంచిన పానీపూరీ.. 100 మందికి సీరియస్.. ఎక్కడంటే..

పానీపూరీ

పానీపూరీ

West begnal: పానీ పూరీ తిన్న వారంతా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు కాసేపటికే వాంతులూ, విరేచనాలు అయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • West Bengal, India
పశ్చిమ బెంగాల్ లో (West bengal) షాకింగ్ ఘటన జరిగింది. హుగ్లీ జిల్లాలోని సుగంధ గ్రామ పంచాయతీలోని డోగాచియా ప్రాంతంలోని ఒక వీధిలో పానీపూరి దుకాణం ఉంది. అందులో.. స్థానికులు కొంత మంది రోజంతా పానీపూరీ (Pani puri) తిన్నారు. అయితే.. తిన్న కాసేపటికే వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంట వెంటనే వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని వెంటనే కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బాధితులను టెస్ట్ చేసిన వైద్యులు ఫుడ్ పాయిజనింగ్ తోనే (Food poisoning)  ఇలా జరిగిందని అన్నారు.

అదే విధంగా అస్వస్థతకు గురైన వారు.. డోగాచియా, బహిర్ రణగాచా, మకల్తలా నివాసితులుగా డాక్టర్లు గుర్తించారు. బాధితులందరికి ప్రత్యేక వార్డులలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వైద్యఆరోగ్య శాఖ అధికారుల ప్రత్యేక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రోగులకు మందులు అందించారు. వారు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో..  ఎక్కువ మంది జబ్బుపడిన వారిని ఆసుపత్రులలో చేరినట్లు తెలుస్తోంది.



ఇదిలా ఉండగా పెళ్లిలో కొత్త జంట చేసిన పనిప్రస్తుతం ఫన్నీగా మారింది.

పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. కొత్త జంట అదిరిపోయే కాస్టూమ్ వేసుకున్నారు. ఇద్దరు కూడా కుంకుమ రంగులో మ్యాచింగ్ వస్త్రాలు ధరించారు. అతిథులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హజరయ్యారు. అప్పుడు కొత్త జంట ఒకరి నోటిలో మరోకరు తీపి పదార్థాలను తినిపించుకుంటున్నారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. వరుడి నోట్లో వధువు.. ప్లేట్ లో ఉన్న స్వీట్ పెట్టడానికి ట్రై చేసింది. కానీ దీనికి వరుడు నిరాకరించాడు. ఆమెకు అందకుండా దూరంగా జరిగాడు.

దీంతో వధువు చిర్రెత్తుకొచ్చింది. అతని మీద పడి మరీ తినిపించడానికి ట్రైచేసింది. దీంతో ఇద్దరు ఒకరిని మరోకరు తోసుకుంటున్నారు. సరదాగా చేసిన పనికాస్త.. కొత్త జంట కొట్టుకొవడం వరకు వెళ్లింది. అక్కడ ఉన్న వారు.. ఆపడానికి ప్రయత్నించినప్పటికి ఎవరు తగ్గడంలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. అవాక్కవుతున్నారు.. మరికొందరు.. ఇదేందిరా నాయన అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Hospitalised, Junk food, West Bengal

తదుపరి వార్తలు