• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • OUT ON A WILD RIDE MEN GET INSTANT KARMA AFTER BUFFALO TAKES REVENGE IN VIRAL VIDEO NK

ఎద్దుతో ఎక్స్‌ట్రాలు... ఆనందం తీర్చేసింది... వైరల్ వీడియో...

ఎద్దుతో ఎక్స్‌ట్రాలు... ఆనందం తీర్చేసింది... వైరల్ వీడియో... (credit - twitter)

మనలో చాలా మంది మూగ జీవాలకు తెలివి ఉండదనుకుంటారు. కానీ... ఈ ఘటనను చూశాక... అవి ఎంత తెలివైనవో అర్థం చేసుకోవచ్చు.

  • Share this:
    ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి పర్వీన్ కస్వాన్ మరో అద్భుతమైన వీడియోతో... నెటిజన్లను పలకరించారు. ఎక్కడ జరిగిందో తెలియని ఈ ఘటనను చూసిన వారంతా... ఇదో స్వీట్ రివెంజ్ అంటున్నారు. జనరల్‌గా పర్వీన్ కస్వాన్ ట్విట్టర్ పేజీలో వన్యప్రాణులు ఫుల్లుగా ఉంటాయి. అరుదైన జంతువులు, పక్షుల్ని చూపిస్తారు. ఈసారి ఆయన... రోడ్డుపై జరిగిన ఘటనను మన ముందుకు తెచ్చారు. ఇందులో... కొందరు వ్యక్తులు ఎద్దుకు ఎడ్లబండి కట్టి... దాన్ని వేగంగా ఉరికించారు. నిజానికి ఆ ఎద్దు చాలా వేగంగా పరిగెడుతోంది. అయినప్పటికీ వాళ్లు ఇంకా ఇంకా అంటూ దాన్ని కొట్టసాగారు.

    పక్కన రోడ్డుపై వెళ్తున్న వాహనాల కంటే వేగంగా పరిగెడుతున్న ఆ ఎద్దుకి... వాళ్ల తీరుతో చిరాకొచ్చింది. అది ఇబ్బంది పడుతుంటే... వాళ్లు నవ్వసాగారు. అప్పటికప్పుడు ఓ ప్లాన్ వేసుకున్న ఎద్దు... రోడ్డుపై డివైడర్ ముగిసిన చోట... రైట్ టర్న్ తీసుకొని... అవతలి రోడ్డువైపు వెళ్లింది. దాంతో... ఎడ్లబండి చక్రం... డివైడర్‌ను ఢీకొట్టింది. ఒక్కసారిగా ఎడ్లబండి పక్కకు ఒరిగింది. దానిపై ఉన్న ముగ్గురూ ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఎద్దు మాత్రం ఎలాంటి గాయాలూ అవ్వకుండా... తెలివిగా తప్పించుకొని పారిపోయింది.


    జంతువుల్ని తక్కువ అంచనా వెయ్యొద్దని పర్వీన్ కస్వాన్ సూచించారు. నెటిజన్లకు ఈ వీడియో తెగ నచ్చేస్తోంది. ఆ ఎద్దు వాళ్ల తిక్క కుదిర్చిందని అంతా అంటున్నారు. దాని తెలివితేటల్ని మెచ్చుకుంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: