Home /News /trending /

ORANGUTAN LOVINGLY FEEDING AND PLAYING WITH 3 TIGER CUBS IS MOST BEAUTIFUL THING ON INTERNET VIDEOS GOES VIRAL PAH

వావ్.. పులి పిల్లలను అమ్మలా లాలిస్తున్న చింపాంజీ... వీడియో వైరల్..

పులి పిల్లలను లాలిస్తున్న చింపాంజీ

పులి పిల్లలను లాలిస్తున్న చింపాంజీ

Viral video: మూడు పులి కూనలు చింపాంజీతో ప్రేమగా ఉంటున్నాయి. చిన్న పులి పిల్లలు అచ్చం.. తన తల్లి వద్ద ఉన్నట్లు చింపాంజీతో ఎంతో బాగా ఆడుకుంటున్నాయి.

సోషల్ మీడియాలో (Social media) రకరకాల వీడియోలు వైరల్  (viral videos) అవుతుంటాయి. వీటిలో కొన్ని షాకింగ్ కు గురిచేసేలా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటాయి. ఇక.. జంతువుల ఫన్నీ కంటెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెటిజన్లు వెరైటీ వీడియోలను చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. వీటిలో కొన్ని ఎమోషనల్ కు గురిచేసేవిలా కూడా ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి వీడియోలు అనేకం నెట్టింట హల్ చల్ చేశారు. ఇప్పుడు మరోక వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమయ్యింది. మనం తరుచుగా.. కుక్కలు, పిల్లులు, గున్న ఏనుగులు, చింపాంజీల వంటి అనేక జంతువులు ఫన్నీగా ప్రవర్తించినటువంటి అనేక వీడియోలను చూశాం.

ఇవి చాలా ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి. వీడి చేష్టలు, పనులు నవ్వుతెప్పించే విధంగా ఉంటాయి. సాధారణంగా జంతువుల జాతీ వైరం ఉంటుంది. కానీ కొన్ని సార్లు.. కుక్కలు, పిల్లుల వంటి జాతీ వైరమున్న జీవులను చిన్నప్పటి నుంచి ఒక దగ్గర పెంచితే అవి, వాటి వైరం మర్చిపోయి కలిసి ఉంటాయి. ఇలాంటి అనేక వీడియోలు గతంలో జరిగాయి. ఈ వీడియో గతంలోనే జరిగింది. ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.





పూర్తి వివరాలు.. అమెరికాలోని (america) సౌత్ కరోలినా లోని మిర్టిల్ బీచ్ సఫారీలో చింపాంజీ, మూడు పులి పిల్లలను ప్రేమగా లాలిస్తుంది. అచ్చం అవి తమ తల్లి వద్ద ఉన్నట్లు వాటితో గడుపుతున్నాయి. చింపాంజీ (Orangutan) కూడా పులి పిల్లలకు పాలు తాగిస్తు.. వాటిని తన చేతుల్లో ఎత్తుకుంది. ఆ తర్వాత.. దాన్ని ప్రేమగా నిమురుతూ.. కౌగిలించుకుంటూ.. భావోద్వేగానికి లోనైంది.



ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు ఎమోషన్ కు (Emotional   Video)  గురౌతున్నారు. మిర్టిల్ బీచ్ సఫారీలో చింపాంజీ, మూడు పులి పిల్లలకు (Tiger cubs) సర్రోగేట్ మదర్ గా మారినట్లు తెలుస్తోంది.  కాగా, ఈ వీడియోను.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సమ్రాట్ గౌడ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Tigers, Trending video, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు