Home /News /trending /

OPTICAL ILLUSION WHAT DO YOU SEE IN FRONT OF YOU IN THIS PHOTO FIND OUT HOW YOUR PERSONALITY IS BASED ON THAT GH VB

Optical Illusion: ఈ ఫొటోలో మీకు ముందు ఏం కనిపిస్తోంది..? దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మన మెదడుకు (Brain) ఎడమ, కుడి అనే రెండు సైడ్స్ ఉంటాయి. ఇవి ఒకదానికొకటి భిన్నంగా పనిచేస్తాయి. రైట్ బ్రెయిన్ థింకర్ (Right Brain Thinker), లెఫ్ట్ బ్రెయిన్ థింకర్ (Left Brain Thinker) అనే పదాలు మీరు వినే ఉంటారు.

మన మెదడుకు (Brain) ఎడమ, కుడి అనే రెండు సైడ్స్ ఉంటాయి. ఇవి ఒకదానికొకటి భిన్నంగా పనిచేస్తాయి. రైట్ బ్రెయిన్ థింకర్ (Right Brain Thinker), లెఫ్ట్ బ్రెయిన్ థింకర్ (Left Brain Thinker) అనే పదాలు మీరు వినే ఉంటారు. మీరు రైట్ బ్రెయిన్ థింకరా లేదా లెఫ్ట్ బ్రెయిన్ థింకరా అనేది మీరు ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. మీ మెదడులో రైట్ సైడ్ ఆధిపత్యం (Dominance) వహిస్తే మీరు రైట్ సైడ్ బ్రెయిన్ థింకర్ అని చెప్పచ్చు. మీ మెదడులో కుడి లేదా ఎడమ వైపు ఆధిపత్యం వహించినా మీరు టూ సైడ్స్ లక్షణాలు కలిగి ఉంటారు. కాకపోతే మీ మెదడులో ఆధిపత్యం వహించే సైడ్ లక్షణాలు మీలో ఎక్కువగా ఉంటాయి. మరి ఈరోజు ఆప్టికల్ ఇల్యూజన్ (Optical Illusion) మీ మెదడులో ఏ వైపు ఆధిపత్యం చెలాయిస్తుందో మీకు తెలియజేయనుంది. ఈ ఇల్యూజన్‌ మీరు ముందుగా గమనించే జంతువు ఆధారంగా మీ వ్యక్తిత్వ లక్షణాలను బయట పెడుతుంది. మరి ఈ ఇల్యూజన్‌లో మీరు ఏ జంతువుని చూశారో? దాని ప్రకారం మీ పర్సనాలిటీ ట్రైట్స్ లేదా వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రింది ఫొటోని ఒకసారి చూడండి.

పులి తల
ఫొటో చూసిన తర్వాత మీకు మొదటగా పులి తల కనిపించినట్లయితే.. మీ మెదడులో కుడి వైపు ఆధిపత్యం (Right Side Of The Brain Is Dominant) వహిస్తుందని అర్థం. రైట్ సైడ్ ఆధిపత్యం గల బ్రెయిన్ ఉన్న మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్లాన్ చేయడానికి, పరిస్థితులను విశ్లేషించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మీరు చాలా లాజికల్‌గా, క్యాలిక్యులేటివ్‌గా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి, ప్రతి నిర్ణయంలో మీరు మొండిగా ఉంటారు. ఇతరుల అభిప్రాయాలను అంతగా పట్టించుకోకుండా విస్మరిస్తారు.

* వ్యక్తిత్వ లక్షణాలు

1- ప్లానర్: మీరు పనులను చేసేముందు వాటిని టు-డూ (To-do) లిస్టులో ప్లాన్ చేయడానికి ఇష్టపడతారు.

2- లాజికల్: తుది నిర్ణయానికి రావడానికి ముందు మీరు అన్ని విషయాలను గమనించి విశ్లేషిస్తారు.

3- రేషనల్ : మీరు లక్ష్యాలను సాధించడానికి వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా తెలివిగా, వివేకంతో సెన్సిబుల్ గా ఆలోచించి మీ లక్ష్యాలను సాధిస్తారు.

4- రియలిస్టిక్: మీరు భ్రమల్లో బతకకుండా వాస్తవ ప్రపంచాన్ని క్లారిటీగా చూడగలుగుతారు. అలాగే ఏదైనా నిర్దిష్ట పరిస్థితిలో మీ వల్ల సాధ్యమయ్యే పని ఏంటో ఈజీగా తెలుసుకోగలుగుతారు.

5- క్లియర్ మైండ్: మీకు స్పష్టమైన లక్ష్యాలు ఉంటాయి. అంతేకాదు, వాటిని సాధించడానికి అనుసరించాల్సిన మార్గాలపై మీకు పూర్తిగా అవగాహన ఉంటుంది.

* వేలాడుతున్న కోతి
మీరు మొదట వేలాడుతున్న కోతిని చూసినట్లయితే, మీ మెదడులో ఎడమవైపు ఆధిపత్యం (Left Side Of The Brain Is Dominant) వహిస్తుంది. ఈ కారణంగా మీలో క్రియేటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. మీరు క్రిటికల్ థింకింగ్ కంటే మీ అంతర్ దృష్టి (Intuition) ఆధారంగా లేదా మీ మనసుకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు.

వ్యక్తిత్వ లక్షణాలు

1- తొందరపాటు: మీరు ఎలాంటి ప్లానింగ్ లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాదు, మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించే స్పెషల్ టాలెంట్‌ను కలిగి ఉంటారు.

2- ఎమోషనల్: మీరు చాలా ఎమోషనల్ పర్సన్ కూడా. నిర్ణయాలు తీసుకునే ముందు అతిగా ఆలోచించి మీరు సమయాన్ని వృథా చేస్తారు.

3- క్రియేటివ్: మీలో క్రియేటివ్ థింకింగ్ చాలా ఎక్కువ. అందుకే మీరు సంగీతం, కళలు, ఇతర సృజనాత్మక విభాగాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు.

4- సహజమైన ఆలోచనలు: మీరు మీ అంతర్ దృష్టి లేదా మీలోని సహజమైన ఆలోచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకునే ముందు మీరు ఎలాంటి రూల్స్ పాటించాలి.

5- డ్రీమర్: మిమ్మల్ని ఎక్కువగా కలలు కనే డ్రీమర్స్ అని నిస్సంకోచంగా అనొచ్చు. జీవితంలో మీరు ఎక్కువ సేపు మీ డ్రీమ్‌ల్యాండ్‌లోనే గడుపుతారు.
Published by:Veera Babu
First published:

Tags: Brain, Innovative thinking, Optical Illusion, Thinking fast and slow

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు