• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • ONLY SON WITH BUNGALOW AT LEAST 20 ACRE FARMHOUSE MATRIMONIAL AD GOES VIRAL IN SOCIAL MEDIA TAKE A LOOK TWITTERATI REACTIONS GH SRD

Viral News: వరుడు కావలెను..అబ్బాయికి 20 ఎకరాల ఫామ్​హౌస్ ఉండాలి..వంట రావాలి..

ప్రతీకాత్మక చిత్రం

Viral News: కాబోయే భాగస్వామి ఇలా ఉండాలి.. అలా ఉండాలని అని అబ్బాయిలు, అమ్మాయిలు ఎన్నో ఊహించుకుంటారు. తమను ప్రేమించే వారు రావాలనుకోవడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలు కనపరుస్తారు. అందం దగ్గరి నుంచి చిన్నచిన్న విషయాలు కూడా తమకు నచ్చే విధంగా ఉండే పార్ట్నర్ రావాలనుకుంటారు.

  • Share this:
కాబోయే భాగస్వామి ఇలా ఉండాలి.. అలా ఉండాలని అని అబ్బాయిలు, అమ్మాయిలు ఎన్నో ఊహించుకుంటారు. తమను ప్రేమించే వారు రావాలనుకోవడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలు కనపరుస్తారు. అందం దగ్గరి నుంచి చిన్నచిన్న విషయాలు కూడా తమకు నచ్చే విధంగా ఉండే పార్ట్నర్ రావాలనుకుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని మ్యాట్రిమొనియల్​ యాడ్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలు అరుదైన విషయాలను యాడ్స్​లో ఇస్తున్నారు. ఇలాంటి యాడ్లు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియా వాడని అమ్మాయి కోసం చూస్తున్నానని బెంగాల్​కు చెందిన ఓ లాయర్​ వెడ్డింగ్ యాడ్ ఇవ్వడంతో అది వైరల్​ అయింది. అలాగే అందంగా ఉన్న్ భాగస్వామి కోసం చూస్తున్నామని కూడా కొన్ని ప్రకటనలు కనపిస్తున్నాయి. కాగా ఇటీవలి కాలంలో అబ్బాయిల కోసం అమ్మాయిలు ఇస్తున్న మ్యాట్రిమొనీ యాడ్స్ కొన్ని వైరల్​గా మారాయి.

ఫెమినిస్ట్ భావాలున్న అమ్మాయి.. పెళ్లి చేసుకునేందుకు 20 ఎకరాల ఫామ్​హౌస్​, బంగ్లా ఉన్నఅబ్బాయి కోసం చూస్తోందని ఓ పేపర్​లో మాట్రిమోనియల్​ యాడ్ వచ్చింది. అలాగే ఒక్కడే కొడుకై, వంట కచ్చితంగా రావాలని ఉంది. ఈ యాడ్ ఫొటోను ఆర్యఅతిథి అనే యూజర్ ఐడీ నుంచి​ ట్విట్టర్​లో పోస్ట్ చేయడంతో వైరల్​గా మారింది. “ఉన్నత చదువులు చదివిన 30 ఏళ్ల అమ్మాయి.. పెళ్లి చేసుకునేందుకు అబ్బాయి కోసం చూస్తోంది. ఆమె సోషల్ సెక్టార్​లో పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఫెమినిస్ట్ భావాలు ఉన్నాయి” అని యాడ్ మొదలైంది. ఆ తర్వాత అబ్బాయికి ఏం ఉండాలో ప్రస్తావన ఉంది. “అబ్బాయికి మంచి ఇళ్లు ఉండాలి. అలాగే ఆ ఇంట్లో ఒక్కడే కొడుకై 25 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. బంగ్లా, కనీసం 20 ఎకరాల్లో ఫామ్​హౌస్​, మంచి వ్యాపారం ఉండాలి. అలాగే వంట వచ్చిఉండాలి. అలాంటి వారు మెయిల్ చేయండి” అని ఆ యాడ్​లో ఉంది.












ఈ మ్యాట్రిమోనియల్​ యాడ్ చూసిన నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. నటి రీచా చద్దా కూడా ఈ యాడ్​ను షేర్ చేశారు. “నీ కోసం ఎవరో వేచిచూస్తున్నారు” అని కామెంట్ చేసింది. అయితే యాడ్​లో ఇచ్చిన మెయిల్ అడ్రస్ అనుమానాస్పదంగా ఉందని, ఇది కచ్చితంగా ట్రోల్ అని కొందరు అభిప్రాయపడ్డారు. తాము కచ్చితంగా మెయిల్​ చేస్తామని రాసుకొచ్చారు. ఇక గ్యాస్​ లేకుండా వంట చేసే అబ్బాయి కావాలేమో అని మరో యూజర్​ సరదా కామెంట్ చేశారు. ఇక పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నానంటూ.. 20 ఎకరాల ఫామ్​హౌస్​ కావాలా అని ఓ యూజర్ ప్రశ్నించారు.
Published by:Sridhar Reddy
First published: