ఆశ్చర్యం... కేదార్‌నాథ్‌లో పర్వతం మెట్లు ఎక్కిన ట్రాక్టర్... వైరల్ వీడియో

ట్రాక్టర్ రోడ్డుపై వెళ్లగలదు గానీ... మెట్లు ఎలా ఎక్కగలదు? అదీ కాక హెవీ లోడ్‌తో ఎలా వెళ్లింది? అని అందరూ ఆశ్చర్యపోతూ ఆ వీడియోని చూస్తున్నారు.

news18-telugu
Updated: July 22, 2020, 1:43 PM IST
ఆశ్చర్యం... కేదార్‌నాథ్‌లో పర్వతం మెట్లు ఎక్కిన ట్రాక్టర్... వైరల్ వీడియో
ఆశ్చర్యం... కేదార్‌నాథ్‌లో పర్వతం మెట్లు ఎక్కిన ట్రాక్టర్... వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
ఎక్కడైనా రోడ్డు ఎత్తుగా ఉంటే... అక్కడ హెవీ లోడ్‌తో వాహనాలు వెళ్లడం చాలా కష్టమవుతుంది. డ్రైవర్లు ఎంతో కష్టపడితే తప్ప ఆ రోడ్డును వాహనాలు దాటలేవు. అలాంటిది... కేదార్‌నాథ్ పర్వతంపైకి ట్రాక్టర్‌ను తీసుకెళ్లడమంటే మాటలా? అది కూడా రోడ్డుపై కాదు... మెట్లపై నుంచి ఎక్కించుకుంటూ... భారీ లోడ్‌తో ట్రాక్టర్‌ను నడిపారు. ఇలాంటి దృశ్యం ఇండియాలో మాత్రమే కనిపిస్తుంది అని ప్రపంచ దేశాలు అంటున్నాయంటే... ఎంత అరుదైన సందర్భమో చూడండి. కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం దగ్గర జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వీర వైరల్ అయ్యింది. ట్రాక్టర్‌పై ఆరుగురు కూర్చున్నారు. కొంత మంది సహాయకులతో... ఆ ట్రాక్టర్‌ను మెట్లు ఎక్కించారు. ట్రాక్టర్‌పై ఉన్న భారీ లోడ్‌ను కింద పడకుండా తాళ్లతో బలంగా కట్టారు.

ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా ఈ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇది ఇండియాలో మాత్రమే జరుగుతుంది అని ఆయన క్యాప్షన్ పెట్టారు. సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫాంలలో ఈ వీడియో షేర్ అయ్యింది. ట్విట్టర్‌లో దీనికి 76వేల వ్యూస్ వచ్చాయి. ఇలా కేదార్‌నాథ్ టెంపుల్‌కి దారిచూపే మెట్లపై ట్రాక్టర్ నడపడంపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.గురుత్వాకర్షణ శక్తి, ఈక్విలిబ్రియం, వెయిట్ డిస్ట్రిబ్యూషన్, మోషన్ అండ్ బ్యాలెన్సింగ్ వంటి అన్నీ ఉపయోగించి ఆ ట్రాక్టర్‌ను నడపడం హ్యాట్సాప్ అని ఓ యూజర్ మెచ్చుకున్నారు. ఇది చాలా క్రేజీగా ఉంది. డ్రైవర్, ట్రాక్టర్, లోడ్ మేనేజర్ అందరికీ హ్యాట్సాఫ్ అని మరో యూజర్ అన్నారు. ఆ మెట్లు ఎంతో మంది చెల్లించిన పన్నుల ద్వారా నిర్మించారనీ... ఇలాంటి భారీ వాహనాలు నడిపేందుకు కాదు అని మరో యూజర్ అభ్యంతరం తెలిపారు. ఇది చూడటానికి ఎంతో ఫన్నీగా ఉన్నా... ఇదో ప్రమాదకరమైన సాహసం అని మరో యూజర్ తెలిపారు.

సోనాలికాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన రామన్ మిట్టల్ ఈ వీడియోని లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. తమ కంపెనీకి సంబంధించిన వాహనమే అది అని చెప్పారు. అసాధ్యాన్ని తమ చిన్న ట్రాక్టర్ సుసాధ్యం చేయడం గర్వంగా ఉందన్నారు. అది ప్రపంచంలోనే బెస్ట్ హెవీ డ్యూటీ ట్రాక్టర్ రేంజ్ అని తెలిపారు.గత నెల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... కేదార్‌నాథ్ మఠం అభివృద్ధి, పునర్నిర్మాణ ప్రాజెక్టుపై సమీక్ష జరిపారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
Published by: Krishna Kumar N
First published: July 22, 2020, 1:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading