హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

పాక్ లో కాశ్మీర్ అంశంపై వీడియో కాన్ఫరెన్స్.. మధ్యలో హనుమాన్ చాలీసా.. జై శ్రీరాం నినాదాలు..

పాక్ లో కాశ్మీర్ అంశంపై వీడియో కాన్ఫరెన్స్.. మధ్యలో హనుమాన్ చాలీసా.. జై శ్రీరాం నినాదాలు..

image credits : Twitter

image credits : Twitter

జమ్మూ కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్ లో పలువురు అధికారులు, మానవ హక్కుల కార్యకర్తలు ఏర్పాటుచేసుకున్న వీడియో కాన్ఫరెన్స్ హ్యాక్ అయింది. ఇండియాకు చెందిన పలువురు హ్యాకర్లు ఈ మీటింగ్ ను హ్యాక్ చేశారు.

 • News18
 • Last Updated :

  కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన, ఆర్టికల్ 370 రద్దు అనే అంశంపై పాకిస్థాన్ పలువురు అధికారులు, మానవ హక్కుల కార్యకర్తలు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ‘భారత ఆక్రమణలో 72 సంవత్సరాల కాశ్మీర్’ అనేది అంశం. మీటింగ్ సీరియస్ గా సాగుతున్నది. వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కాశ్మీరి ప్రజలు ఇన్నాళ్లు ఎదుర్కొన్న దురాగాతాల గురించిన మాట్లాడుతున్నారు. మధ్యలో ఉన్నట్టుండి హనుమాన్ చాలీసా.. ఆ మీటింగ్ లో ఉన్నవాళ్లకు ఏమీ అర్థంకాలేదు. మధ్య మధ్యలో జై శ్రీరామ్ నినాదాలు కూడా వినిపించాయి.

  జమ్మూ కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్ లో పలువురు అధికారులు, మానవ హక్కుల కార్యకర్తలు ఏర్పాటుచేసుకున్న వీడియో కాన్ఫరెన్స్ హ్యాక్ అయింది. ఇండియాకు చెందిన పలువురు హ్యాకర్లు ఈ మీటింగ్ ను హ్యాక్ చేశారు. అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రధాన కార్యదర్శి మాలిక్ నదీమ్ అధ్యక్షతన సాగిన ఈ జూమ్ మీటింగ్ ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. రెండు గంటల పాటు సాగిన ఈ మీటింగ్ ను సుమారు 47 నిమిషాల పాటు హ్యాక్ చేసినట్టు సమాచారం. ఈ వీడియో ఫేస్బుక్ లో ప్రసారం కాగానే.. డాక్టర్ వలీద్ మాలిక్ సమావేశాన్ని గురించి ప్రసంగిస్తూ మాట్లాడారు. కాశ్మీర్ లో ప్రజలు ఎదుర్కొంటున్న బాధల గురించి మాట్లాడుతుండగా... మధ్యలో సడెన్ గా హనుమాన్ చాలీసా వినబడింది.


  ఇది చూసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నవాళ్లంతా అవాక్కయ్యారు. వాళ్లు మాట్లాడుతుండగానే.. హనుమాన్ చాలీసా తో పాటు జై శ్రీరామ్ నినాదాలు హోరెత్తాయి. అయితే ఇది చూసిన వాళ్లంతా ఇది ఎవరు చేస్తున్నారో తమకు తెలుసునని మీటింగ్ ను కొనసాగించారు. కాషాయ కార్యకర్తలు వస్తున్నారని అంటూ.. మాట్లాడారు.

  వలీద్ తో పాటు మరికొంతమంది వక్తలు మాట్లాడేప్పుడు.. కీప్ క్రయింగ్ కీప్ క్రయింగ్ (ఏడ్వండి.. ఏడుస్తూనే ఉండి.. లోల్..!) అనే మాటలు వినిపించాయి. అంతేగాక హిందూ వ్యతిరేకవాదులారా.. అంటూ పలు శబ్దాలు అస్పష్టంగా వినిపించాయి. మీటింగ్ జరుగుతుండగానే ఆ హ్యాకర్లు వారికి మేము భారతీయులం అని చెప్పడం వివాదాస్పదమైంది.

  ఇదిలాఉండగా.. హ్యాకర్లు చేసిన పనికి సోషల్ మీడియాలో ఒక వర్గం మెచ్చుకుంటుండటం గమనార్హం. ఈ వీడియోకు సంబంధించిన క్లిప్పింగ్ ను ఒక ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అది కొద్ది సేపట్లోనే వైరల్ గా మారింది.

  కాగా, పాక్ కు సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్ లు హ్యాక్ కు గురికావడం ఇదే మొదటిది కాదు. గతంలోనూ ఆగస్టు లో పాకిస్థాన్ కు చెందిన పి టివి తో పాటు పలు టీవీ ఛానెళ్లను హ్యాకర్లు హ్యాక్ చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాక్ కు చెందిన డాన్ టీవీలో భారత త్రివర్ణ పతాకం సుమారు ఒక నిమిషం పాటు అలాగే ఉండేలా హ్యాకర్లు షాకిచ్చారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Hacking, Pakistan, Trending

  ఉత్తమ కథలు