Home /News /trending /

ONLINE CLASSES VIETNAM UNIVERSITY STUDENT CAUGHT HAVING INTERCOURSE WITH HIS PARTNER DURING ONLINE CLASS AFTER FORGETTING TO TURN OFF MOBILE CAMERA MK

Online Classes: ఆన్‌లైన్ క్లాసు.. లైవ్‌లో విద్యార్థి సెక్స్.. షాకైన టీచర్, తోటి విద్యార్థులు

ఆన్‌లైన్ క్లాసు. లైవ్‌లో విద్యార్థి సెక్స్

ఆన్‌లైన్ క్లాసు. లైవ్‌లో విద్యార్థి సెక్స్

Online Classes: ఆ యూనివర్శిటీ విద్యార్థి అంతపని చేస్తాడని ఎవరూ ఊహంచలేదు. ఆ ఘటన తర్వాత ఎలా స్పందించాలో టీచర్‌కి అర్థం కాలేదు. మిగతా విద్యార్థులంతా లైవ్‌లో బ్లూఫిల్మ్ చూసినట్లు ఫీలయ్యారు.

    Online Classes: ఈ కరోనా ఎందుకొచ్చిందో గానీ... ఆన్‌లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల చదువులు ఏడ్చినట్లే సాగుతున్నాయి. అసలు వాళ్లు మొబైల్ ముందు పెట్టుకొని... ఏం క్లాసులు వింటున్నారో, టీచర్లు ఏం చెబుతున్నారో... తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు. విద్యా సంవత్సరం చివర్లో ఎగ్జామ్స్ రాయకుండానే పాసైనా... అసలు చదువనేది వచ్చి తీరాలిగా అనేది తేలాల్సిన అంశం. రెండేళ్లుగా విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. ఆన్‌లైన్ క్లాసులు వారికి సరిగా అర్థం కావట్లేదు. ఒక్కోసారి విపరీత పరిణామాలు కూడా జరుగుతున్నాయి. అలాంటి ఓ ఘటన వియత్నాంలో జరిగింది. టీచర్ సహా విద్యార్థులంతా అవాక్కయ్యేలా చేసింది.

    వియత్నాంలో ఓ విద్యార్థి... తన పార్ట్‌నర్‌తో కలిసి సెక్స్‌లో పాల్గొన్నాడు. ఓవైపు ఆన్‌లైన్ క్లాస్ జరుగుతోంది. లైవ్‌లో అంతా కనిపిస్తోంది. ఈ ఘటన హో చీ మిన్ సిటీలో జరిగింది.

    క్లాస్ జరుగుతుంటే సెక్స్‌లోకి జారుకున్న ఆ విద్యార్థి... మొబైల్ కెమెరా టర్న్ ఆఫ్ చెయ్యడం మర్చిపోయాడు. అది కాస్తా లైవ్ అయ్యింది. ఇక విద్యార్థులంతా క్లాస్ వినడం మానేసి... ఫోకస్ అటు పెట్టారు. ఎవరో విద్యార్థి... దాన్ని రికార్డ్ చేశాడు. ఆ క్లిప్‌ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. అది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

    ఇక విద్యార్థి చర్యతో షాకైన ప్రొఫెసర్... "ఏయ్... ఏం చేస్తున్నావు నువ్వు... ఓ పక్క ఫిజికల్ క్లాస్ జరుగుతుంటే... నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్ చేస్తున్నావు. ఇక్కడ ఆన్‌లైన్ క్లాస్ జరుగుతుంటే... నీకు సెక్స్ కావాల్సొచ్చింది" అంటూ ఫైర్ అయ్యారు.

    ఇది కూడా చదవండి: Video: కప్పను ఎత్తుకుపోయిన కందిరీగ... ఏనాడైనా చూశామా... కలియుగ వింత!

    లెక్చరర్ ఇలా వాయించేసరికి... విద్యార్థికి తెలిసొచ్చింది. వెంటనే పక్కకు పారిపోయి... డ్రెస్ వేసుకొని... కెమెరా ఆఫ్ చేశాడు.

    దీనిపై ఆ విద్యార్థి అటు లెక్చరర్‌కూ, ఇటు విద్యార్థులకూ క్షమాపణ చెప్పినట్లు వియత్నాం న్యూస్ పేపర్ లావో డాంగ్ తెలిపింది. (Lao Dong)

    దీనిపై యూనివర్శిటీలో పెద్ద చర్చే జరిగింది. ఇకపై విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు జరిగేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని నడచుకోవాలని ఆదేశం జారీ చేసింది. అలాగే ఆ వీడియోని ఎవరూ షేర్ చేయవద్దనీ, చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Viral, VIRAL NEWS

    తదుపరి వార్తలు