One Rupee Coin: ఆ రూపాయి నాణెం ఉందా?.. అయితే రూ. 25 లక్షలు పొందే ఛాన్స్

మీ దగ్గర ఒక రూపాయి నాణెం ఉందా? అయితే మీరు ఏకంగా రూ. 25 లక్షలను సంపాధించవచ్చు. కాకపోతే ఆ రూపాయి నాణెం 1913 నాటిదై ఉండాలి.

news18-telugu
Updated: October 14, 2020, 3:23 PM IST
One Rupee Coin: ఆ రూపాయి నాణెం ఉందా?.. అయితే రూ. 25 లక్షలు పొందే ఛాన్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీ దగ్గర ఒక రూపాయి నాణెం ఉందా? అయితే మీరు ఏకంగా రూ. 25 లక్షలను సంపాధించవచ్చు. ఇదంతా అబద్ధం అని అనుకుంటున్నారా? కాదండి నిజమే. కానీ ఆ రూపాయి నాణేం మాత్రం కనీసం వందేళ్ల క్రితం నాటిది అయి ఉండాలి. మీ దగ్గర నిజంగా అలాంటి నాణెం ఉంటే మీరు పాతిక లక్షలను సొంతం చేసుకోవచ్చు. ఇదంతా ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. దేశంలోనే అతి పెద్ద ఆన్ లైన్ మార్కెట్ సంస్థ అయిన ఇండియా మార్ట్ పురాతన నాణేల వేలం నిర్వహిస్తూ ఉంటుంది. ఒక వేళ మీ వద్ద కూడా అలాంటి పురాతన, అరుదైన నాణేలు ఉంటే వాటిని వేలంలో ఉంచవచ్చు. తద్వారా లక్షల రూపాయలను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది.

వెండితో తయారు చేసిన 1913 సంవత్సరం నాటి రూపాయి నాణేం ధరను ఇండియా మార్టు వారు రూ. 25 లక్షలుగా నిర్ణయించారు. విక్టోరియా కాలం నాటి ఆ అరుదైన నాణెం మీ వద్ద ఉంటే రూ. 25 లక్షలను మీరు పొందే అవకాశం ఉంది. ఈ ఒక్క 1913 నాటి నాణమే కాదు మీ వద్ద ఇలాంటి అపురూపమైన నాణేలు ఇంకా ఉంటే వాటిని కూడా వేలంలో ఉంచే అవకాశం ఉంది. మీ వద్ద 18వ శతాబ్ధం కాలం నాటి నాణెం ఉంటే రూ. 10 లక్షలు పొందే అవకాశం ఉంది. 1818లో ఈస్టిండియా కంపెనీ తయారు చేసిన నాణెం ఉన్నా రూ. రూ. 10 లక్షలు సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. అత్యంత అరుదైన ఈ పురాతన నాణెంపై హనుమాన్‌ చిత్రం ముద్రించి ఉంటుంది.

మీ వద్ద పురాతనమైన, అరుదైన నాణాలు ఉండి వాటిని అమ్మాలనుకుంటే ఇండియామార్ట్‌ వారి అధికారిక వెబ్‌సైట్‌ అయిన ఇండియామార్ట్‌.కాంను సంపద్రించాల్సి ఉంటుంది. మొదట ఈ వెబ్‌సైట్‌పై మీరు ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. అనంతరం ఆ వెబ్‌సైట్‌లో అమ్మకందారుడిగా మీరు మీ పేరును నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం మీరు మీ వద్ద ఉన్న నాణేలను అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం వాటిని అమ్మకానికి ఉంచవచ్చు. కొందరు పురాతన నాణేల సేకరణపై అమితమైన ఆసక్తి కలిగి ఉంటారు. అలాంటి వారు ఈ నాణేలను భారీగా డబ్బులు చెల్లించి దక్కించుకుంటారు. అలాంటి వారి కోసం ఈ ఇండియామార్ట్ వేదిక ఉపయోగపడుతోంది.
Published by: Nikhil Kumar S
First published: October 14, 2020, 3:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading