ONE OF THE RAREST DIAMONDS BELIEVED TO HAVE FALLEN TO EARTH FROM SPACE IS UP FOR AUCTION DETAILS HERE GH VB
Black Diamond: అంతరిక్షం నుంచి భూమిపై పడిన వజ్రం..! ఆన్లైన్లో వేలం.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!
ప్రతీకాత్మక చిత్రం (Image Credit : Sotheby's)
అంతరిక్షం నుంచి భూమిపై పడిందని భావిస్తున్న అరుదైన వజ్రం ఒకటి వేలానికి రానుంది. "ది ఎనిగ్మా"గా (The Enigma) పిలిచే ఈ వజ్రం ఉల్కాపాతం జరిగిన సమయంలో భారీ గ్రహశకలం(Asteroid) భూమిని ఢీకొనటం వల్ల ఆవిష్కృతమైనట్లు చెబుతున్నారు.
అంతరిక్షం(Space) నుంచి భూమిపై పడిందని భావిస్తున్న అరుదైన వజ్రం(Diamond) ఒకటి వేలానికి రానుంది. "ది ఎనిగ్మా"గా (The Enigma) పిలిచే ఈ వజ్రం ఉల్కాపాతం జరిగిన సమయంలో భారీ గ్రహశకలం(Asteroid) భూమిని ఢీకొనటం వల్ల ఆవిష్కృతమైనట్లు చెబుతున్నారు. 555.55 క్యారెట్ల ఈ బ్లాక్ డైమండ్(Black Diamond) ప్రపంచంలోనే అత్యంత అరుదైనదని ఆన్లైన్ వేలం సంస్థ సోథ్బై (Sotheby Auctions) చెబుతోంది. ఇంత పరిమాణంలో సహజమైన నల్లని వజ్రం ఉండటమనేది అత్యంత అరుదైన అంశంగా అభివర్ణించింది. దీనిని మొదట 2021-ఫిబ్రవరిలో లండన్‌లో.. ఆ తర్వాత దుబాయ్, లాస్ ఏంజిల్స్‌లోనూ ప్రదర్శించింది సోథ్బై సంస్థ. ప్రస్తుతం దుబాయ్‌లో నిర్వహించనున్న ఈ-వేలంలో బ్లాక్ డైమండ్(Black Diamond Auction)కు 6.8మిలియన్ డాలర్ల ధర (సుమారు రూ.506 కోట్లు) పలుకుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రత్యేకతలెన్నో..
555.55 క్యారెట్లున్న ఈ బ్లాక్ డైమండ్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీనికి కచ్చితంగా 55 కోణాలున్నాయి. అంతేగాక రక్షణ కల్పిస్తున్నట్లు ఉండే అరచేతి చిహ్నం దీని ప్రత్యేకత. గతంలో వేలానికి వచ్చిన ఈ తరహా నల్లని వజ్రాలు(Black Diamonds) క్యారెట్‌కు £13,600 (సుమారు రూ. 13,77,900) చొప్పున అమ్ముడయ్యాయని సోథ్బై తెలిపింది. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు ఆన్లైన్లో వేలానికి అందుబాటులో ఉండనుంది ఈ బ్లాక్‌డైమండ్. దీనిని సొంతం చేసుకునే వారు క్రిప్టోకరెన్సీ(Crypto currency) రూపంలో చెల్లించిన సొమ్మునూ అంగీకరిస్తామని వేలం సంస్థ ప్రకటించడం విశేషం.
క్రిప్టోలతో విలువ పైపైకి..
గతేడాది "The Key 10138"గా అనే పేరుగల 101 క్యారెట్ల డైమండ్ విక్రయంలోనూ క్రిప్టోకరెన్సీతో కొనుగోలు చేయగా అత్యంత ఖరీదైన ఆభరణంగా అది అమ్ముడైంది. సంప్రదాయ చెల్లింపు పద్ధతులతో పాటు బిట్‌కాయిన్, ఈథీరియం చెల్లింపులను అంగీకరిస్తున్నట్లు వేలం నిర్వాహకులు ప్రకటించగా.. పియర్ డైమండ్ 12.3 మిలియన్ డాలర్లకు సమానమైన ధరకు అమ్ముడైంది. అయితే దీనిని కొనుగోలు చేసేందుకు ఏ క్రిప్టోకరెన్సీని ఉపయోగించారో వెల్లడి కాలేదు.
అనేక వేలం సంస్థలు లగ్జరీ ఐటెమ్స్ వేలం కోసం క్రిప్టోకరెన్సీలను స్వాగతిస్తున్నాయి. వీటిలో పెయింటింగ్‌లు, NFTలు, డిజిటల్ ఆర్ట్‌వర్క్‌లు వంటివి ఉన్నాయి. బ్లాక్‌చెయిన్ ఆధారిత టోకెన్లతో నడిచే ఈ కరెన్సీకి డిమాండ్ పెరుగుతున్నందున క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ను స్వాగతిస్తున్నామని సోథ్బై సీఈఓ చార్లెస్ స్టీవర్ట్ తెలిపారు.
జీవితంలో ఒకసారే..
కార్బొనాడో వజ్రాలు అని కూడా పేరున్న ఈ నల్ల వజ్రాలు 2.6 నుంచి 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం నాటివి. నైట్రోజన్, హైడ్రోజన్, ఓస్బోర్నైట్ల మిశ్రమాన్ని కలిగి ఉండే ఈ డైమండ్ మూలకాలు ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లో మాత్రమే కనిపిస్తాయి. ఇవే తరహా మూలకాలు ఉల్కల్లోనూ ఉంటాయని అధ్యయనకర్తలు తేల్చారు.
లండన్‌లోని సోథ్బై సంస్థ జ్యూయలరీ నిపుణురాలు నికితా బినాని ఈ వజ్రాన్ని సహజమైన అద్భుతమని పేర్కొన్నారు. బిలియన్ సంవత్సరాల నాటి అంతరిక్ష అద్భుతాల్లో ఒకదాన్ని పొందే అవకాశం జీవితకాలంలో ఒకసారి మాత్రమే వస్తుందని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. దీని విక్రయం మానవజాతికి తెలిసిన ఓ అరుదైన ఘట్టమని వివరించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.