Home /News /trending /

ONE OF THE GREAT REAL LIFE STORY ABOUT WIFE AND HUSBAND TRUE LOVE AND HERE IS THE DETALIS SSR

ఈ భర్త తన భార్య కోసం ఏం చేశాడో తెలిస్తే కళ్లు చమ్మగిల్లడం ఖాయం.. ఈరోజుల్లో కూడా ఇలాంటి భర్త ఉన్నాడంటే గ్రేటే..!

రమేష్, అజు దంపతులు

రమేష్, అజు దంపతులు

భయంకర క్యాన్సర్‌తో భాదపడుతూ ఉన్న తన భార్యను రక్షించడానికి చేయాల్సిందంతా చేస్తున్నాడు ఆ భర్త. డాక్టర్స్ కూడా ఆమె‌ను కాపాడటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. కొచ్చిలోని ఓ హాస్పిటల్‌లో రెండోసారి కీమోథెరఫి అబ్సర్వేషన్‌లో పెట్టారు. ఆమెకు సచిన్ టెండూల్కర్ అంటే...

ఇంకా చదవండి ...
    భయంకర క్యాన్సర్‌తో భాదపడుతూ ఉన్న తన భార్యను రక్షించడానికి చేయాల్సిందంతా చేస్తున్నాడు ఆ భర్త. డాక్టర్స్ కూడా ఆమె‌ను కాపాడటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. కొచ్చిలోని ఓ హాస్పిటల్‌లో రెండోసారి కీమోథెరఫి అబ్సర్వేషన్‌లో పెట్టారు. ఆమెకు సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం, మరో నాలుగు రోజుల్లో కొచ్చిలో ఇండియన్ పుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. పుట్‌బాల్ మ్యాచ్ ఆటగాళ్ళలో ఆత్మ విశ్వాసం నింపడానికి సచిన్ అక్కడకు వస్తున్నాడు అనే విషయం ఆమెకు తెలిసింది. తన అభిమాన క్రికెటర్ సచిన్ కోచి వస్తున్నాడన్న సంగతి ఆమెకు ఆనందాన్ని కలిగించింది. ఎలాగైనా సచిన్‌ను చూడాలని ఆ ఫుట్‌బాల్ మ్యాచ్‌కి తీసుకెళ్లమని తన భర్తను అడిగింది. ఆయన ఇలాంటి పరిస్థితిలో ఎందుకని, మరోసారి తీసుకెళ్తానని చెప్పాడు. కానీ నిజమేంటో అతనికి తెలుసు.. తనకు మరో అవకాశం రాదని, అందుకే మనసు మార్చుకున్నాడు.

    ఎలాగైనా భార్య కోరిక తీర్చాలనుకున్నాడు. అందు కోసం తన ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి ఎలాగైనా టికెట్స్ కావాలని చెప్పాడు. ఎంత కష్టమైన క్యూలో ఎంత సేపు నిలబడైన టికెట్స్ సంపాదించాలని సూచించాడు. పరిస్థితి దిగజారితే తనను వెంటనే చికిత్సకి తరలించాలి. స్టేడియం దగ్గరో ఉన్న హాస్పటల్‌కి, అంబులెన్స్‌లకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాళ్ళు కావాల్సిన జాగ్రతలు తీసుకున్నారు. ఆమెను తీసుకొని మ్యాచ్‌కి వెళ్ళాడు. వేలాది మంది ప్రేక్షకుల కేరింతలు చూసి తెగ ఆనంద పడింది. ‘సచిన్.. సచిన్’ అనే అరుపులు విని ఆమె బాధనంతా మరిచిపోయింది.

    ఆమె చనిపోయినా తన జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. తన భార్య చివరి కోరిక తీర్చిన తీరును ఆ సందర్భంలో కలిగిన ఆనందం,అనుభూతిని తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. తన ఫ్యామిలీతో స్టేడియం‌లో దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ‘నా భార్య చాలా ధైర్యవంతురాలు. కొద్ది రోజుల్లో చనిపోతుందని తెలిసినా దైర్యంగా ఉండేది. జీవితం ఎంతో అందమైనది. ప్రతీ క్షణం ఆస్వాదించండి. గాడ్ బ్లెస్ యు’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. కొడుకును అపురూపంగా చూసుకుంటూ రోజులు గడుపుతున్నానని చెప్పుకొచ్చాడు. రమేష్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.

    భార్య పట్ల రమేష్ చూపించిన ప్రేమకు నెటిజన్లు హాట్సాఫ్ చెబుతున్నారు. భారమైన గుండెతో రమేష్‌కి అభినందనలు చెబుతున్నారు. భార్య బ్రతికుండగానే నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో రమేష్ లాంటి వాళ్ళు అరుదే కదా. అలాంటి భర్త ప్రేమకు దూరమైన దురదృష్టవంతురాలి పేరు అజు. రమేష్ తన భార్య చివరి కోరిక తీర్చి ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని పొందాడు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కొద్ది రోజులకే రమేష్ భార్య చనిపోయింది. విధి రాతను ఎవరూ తప్పించలేరని ఈ విషయం తెలిసినవారు నిట్టూరుస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Love

    తదుపరి వార్తలు