TS NEWS : బుల్లెట్ బండి ఎక్కిన నర్స్... మొన్న పెళ్లి కూతురు... నేడు స్టాఫ్ నర్సు డాన్స్...

Bullet bandi dance

TS NEWS : బుల్లెట్ బండి పాట ప్రజల జీవితాలతో పెనవేసుకుని పోయింది.. దీంతో ఆపాటకు అనేక మంది చిన్న పిల్లల నుండి పెద్ద వారు సైతం ఆ పాటకు డాన్స్ చేస్తూ.. ఫిదా అవుతున్నారు.. ఇదే పాటకు మొన్న పెళ్లి కూతురు సాయి శ్రీ డాన్స్ చేయగా నేడు స్టాఫ్ నర్స్ ఆ పాటకు డాన్స్ చేసి తోటి సిబ్బందిని ఎంటర్‌టైన్ చేయడంతో ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

  • Share this:
    బుల్లెట్ బండి పాటకు గోదావరి ఖనికి చెందిన నూతన వధువు డాన్స్ చేసి ఇరగదీసిన సంగతి తెలిసిందే..ఆమె డాన్స్‌కు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ చానల్స్ ఫిదా అయ్యాయి..దీంతో ఏ చానల్ చూసిన ఆమె డాన్స్ కనిపించిన పరిస్థితి. అయితే అదే పాటను అనేక మంది మహిళలు తమ సొంతం చేసుకున్నారు. సింగర్ మోహన భోగరాజు చేసిన డాన్స్‌ను అక్షరాల చేస్తు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నారు.

    అయితే తాజాగా ఈ పాటకు స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా ఓ నర్సు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది . అయితే సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి పీహెచ్‌కి చెందిన నర్సు ఈ డాన్స్ చేసినట్టు తెలుస్తోంది.

    అయితే నర్సు ఆసుపత్రిలో డాన్స్ చేయడంపై పై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమచారం. కాని స్వాతంత్య్రదినోత్సవ సంబరాల్లో భాగంగా ఆసుపత్రి కారిడార్‌లో అందకు కూర్చుని డాన్స్ చేయడం తప్పు కాదనే వాదనను వారు తీసుకువస్తున్నారు..ఒకవేళ డాన్స్ చేయాలనుంటే ఆసుపత్రి బయట చేయాల్సి ఉందని ,ఆసుపత్రి ఆవరణలో చేయడం పై శాఖపరమైన చర్యలకు కూడా ఉపక్రమించినట్టు సమాచారం.

    విధులు వదిలిపెట్టి డాన్స్ చేస్తే తప్పు కాని స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా డాన్స్ చేయడం పెద్ద తప్పుగా భావించాల్సిన అవసరం లేదని పలువురు నెటిజన్లు అంటున్నారు..అలా అయితే కోవిడ్ ఆసుపత్రుల్లో వారి రోగుల మనోధైర్యం కోసం అనేక చోట్ల నర్సులు పాటలు, డాన్సులు చేసిన వీడియోలు కూడా అప్పుడు నెటిజన్ల ప్రశంషలు అందుకున్నప్పుడు ఇప్పుడు ఎలా తప్పు అవుతుందని కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    మొత్తం మీద ఈ పాటను తెలంగాణలోని పాలమూరు జిల్లాకు చెందిన లక్ష్మణ్ రాసిన పాటకు సింగర్ మోహన భోగరాజు పాడడతంతో పాటు డాన్స్ చేసి ప్రైవేట్ ఆల్బమ్ విడుదల చేసింది..అయితే ఆమె ఒరిజినల్‌గా పాడిన పాటకు పెద్దగా ప్రాచుర్యం లభించకపోయినా కొద్ది రోజుల తర్వాత పెళ్లి కూతురు సాయిశ్రీ తన పెళ్లిలో భర్త ముందు చేయడం ఆ పాట నేపథ్యానికి అనుగుణంగా డాన్స్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుని కొద్ది రోజుల్లోనే వైరల్ వీడియో‌గా మారింది.
    Published by:yveerash yveerash
    First published: