హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

No stomach man: కడుపు లేకున్నా.. తిండి తింటున్నాడు.. ఏళ్లుగా బతికేస్తున్నాడు.. ఎలాగో తెలుసా?

No stomach man: కడుపు లేకున్నా.. తిండి తింటున్నాడు.. ఏళ్లుగా బతికేస్తున్నాడు.. ఎలాగో తెలుసా?

ఆసుపత్రిలో జువాన్​​ (ఫొటో: ఇన్​స్టాగ్రామ్​)

ఆసుపత్రిలో జువాన్​​ (ఫొటో: ఇన్​స్టాగ్రామ్​)

స్పెయిన్‌(Spain)లోని వాలెన్సియా‌లో నివసిస్తున్న జువాన్ డ్యూయల్ అనే వ్యక్తి ఏకంగా కడుపు, పేగులు, పిత్తాశయం లేకుండా జీవిస్తున్నాడు. అవయవాలు కోల్పోయినా అతడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు.

స్పెయిన్​(Spain)లోని ఓ వ్యక్తి పేగుల్లేకుండా జీవిస్తున్నాడంటా. పేగులే కాదు అసలు కడుపు(stomach) లేకుండా జీవిస్తున్నాడంట. పిత్తాశయం కూడా లేదంటా. ఔనండి నిజం!  మనం తినే ఆహారం గొంతు నుంచి నేరుగా కడుపులోకి వెళ్తుంది. ఆ తర్వాత జీర్ణమై.. మిగతా శరీర భాగాలకు పోషకాలను అందిస్తుంది. అప్పుడే మన శరీరానికి శక్తి వస్తుంది. మనం బతుకగలుగుతాం(living). అయితే స్పెయిన్‌(Spain)లోని వాలెన్సియా‌లో నివసిస్తున్న జువాన్ డ్యూయల్( 36) అనే వ్యక్తి ఏకంగా కడుపు, పేగులు(intestines), పిత్తాశయం(Gallbladder) లేకుండా జీవిస్తున్నాడు. అవయవాలు కోల్పోయినా అతడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. జువాన్‌‌కు 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ‘ఫ్యామిలియల్ మల్టిపుల్ పాలిపోసిస్’ అనే సమస్యతో బాధపడ్డాడు. వంశపారంపర్యంగా సంక్రమిస్తున్న ఈ వ్యాధి వల్ల అతడి జీర్ణ వ్యవస్థ క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు. జువాన్ అమ్మమ్మ కోలన్ ఆడేనొక సినోమా (Colon Adenocarcinoma) అనే సమస్యతో చనిపోయారు. ఆ తర్వాత అతడి తండ్రికి కూడా అదే సమస్య రావడంతో ఆయన పేగులకు సర్జరీ నిర్వహించారు.

జువాన్​కు వైద్యులు ఎన్నో సర్జరీలు చేశారు. ఫలితంగా జువాన్ ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. స్పెయిన్‌లో ఆర్థిక మాంధ్యం కారణంగా అక్కడ జీవించడమే కష్టంగా మారింది. శరీరంలో శక్తి లేకపోవడం వల్ల చాలా బలహీనంగా మారిపోయాడు జువాన్​. కొన్ని నెలల తర్వాత జువాన్ ఇంగ్లాండ్‌కు చేరుకున్నాడు. నిత్యం వ్యాయామం, వాకింగ్ చేస్తూ ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నించాడు. కడుపు, పేగులు లేనప్పుడు అతడికి ఆహార ఎలా జీర్ణమయ్యేది? అతడికి శక్తి ఎలా వస్తుంది? అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. పెపా అనే న్యూట్రిషనిస్ట్ సూచనల ప్రకారం జువాన్ ఆహారాన్ని తీసుకునేవాడు. తన శరీరం ఫిట్‌గా ఉంచుకోడానికి ప్రయత్నించేవాడు.  శరీరానికి శక్తి అందేందుకు తాను కేవలం డోనట్స్, గమ్మీ బీర్స్, పాస్తా మాత్రమే తింటానని జువాన్ తెలిపాడు. ‘‘నాకు ఆహారం జీర్ణం కాదు. కానీ, నాకు శక్తి రావాలంటే రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉండాలి. అలా తినడం చాలా కష్టమైన పని. నేను ఎంత కష్టపడతానో అంత ఆహారాన్ని శరీరానికి అందించాల్సిందే’’ అని జువాన్ తెలిపాడు.









View this post on Instagram






A post shared by Juan Dual (@dualcillo)



ఆపరేషన్ల మీద ఆపరేషన్లు..

జువాన్‌కు 19 ఏళ్ల వయస్సు రాగానే మరోసారి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వైద్యులు అతడి ప్రేగులు, పెద్ద ప్రేగు, పురుష నాళాన్ని తొలగించారు. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమే. జువాన్‌కు 28 ఏళ్ల వయస్సు రాగానే అతడి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆ వ్యాధి అతడి కడుపుకు కూడా సోకింది. దీంతో వైద్యులు కడుపును కూడా తొలగించారు. దీంతో అతడు దాదాపు చావును చూసి వచ్చాడు. 105 కిలోల బరువుండే అతడు.. కడుపును తొలగించడం వల్ల కొద్ది రోజుల్లోనే 57 కిలోలను కోల్పోయాడు. అయితే, సమస్య అంతటితో ఆగలేదు. అతడి పిత్తాశయాన్ని(Gallbladder) బ్యాక్టీరియా ఎటాక్ చేసింది. దీంతో వైద్యులు దాన్ని కూడా తొలగించారు. అలా అతడు కడుపు, పేగులు, పిత్తాశయాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత జువాన్ పరిస్థితి మరింత బాధాకరంగా మారింది.

First published:

Tags: Spain, Trending

ఉత్తమ కథలు