Bike or Bus: బైకా లేకా ఆర్టీసీ బస్పా..? బండిపై ఇంతమందా..? ఏదైనా ప్రమాదం జరిగితే.. వైరల్ అవుతున్న వీడియో

వైరల్ గా

13 Members On Bike: ఒక బైక్ పై ఎందరు వెళ్లాలి ఇద్దరు.. అంతకు మంచి ఒక్కరు ఎక్కినా ట్రిపుల్ రైడింగ్ పేరుతో ఫైన్ వేస్తారు.. ఎందుకంటే అది ప్రమాదకరం కాబట్టి.. అలాంటిది ఒక బైక్ పై 13 మంది ప్రయాణిస్తే ఏమనాలి.. అసలు బైక్ పై అంతమంది ఎలా? కూర్చున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.. మీరూ చూడండి..

  • Share this:
    Viral Video: బైక్ పై ముగ్గురు వెళ్లడమే (Triple Riding) ప్రమాదకరమని ట్రాఫిక్ రూల్స్ (Traffic rules) చెబుతున్నాయి. అయినా ఒక బైక్ (Bike) పై ముగ్గురు కూర్చొని ప్రయాణించాలి అంటే అసలు ప్లేస్ సరిపోదు. కొందరు ఫ్యామిలీ అని చెప్పి పిల్లలతో కలిపి నలుగురు, ఐదుగురు బైక్ పై కనిపిస్తేనే.. బాబోయ్ ఏంటి ఇంత రిస్క్ చేస్తున్నారు.. ఏదైనా ప్రమాదం జరిగితే అని అనుకుంటాం.. అలాంటిది ఒక బండిపై 12 మంది (12 Members On Bike ).. ఆ బైక్ నడిపే వ్యక్తితో 13 మంది వెళ్తే దానిని ఏం అనాలి.. అసలు అది బైకా లేకా ఆర్టీసా బస్సా (Bike or rts bus).. ఆటోలో కూడా 13 మంది పట్టారు.. అలాంటిది ఒక బైక్ పై 12 మంది పిల్లలను ఎలా ఎక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ (Viral Video) గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ వ్యక్తి తన బండిపై 12మందిని ఎక్కించుకున్నాడు. అందరూ పిల్లలే. రోడ్డుపై దూసుకెళ్తున్నాడు. బైక్ సీటు పైనే కాదు ఆఖరికి వీల్స్ ను కూడా అతడి వదల్లేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడో చిన్నారిని కూర్చోబెట్టాడు. అసలే చిన్న పిల్లలు తెలిసి తెలియని వయసు వారితో ఇలాంటి ఫీట్ చేస్తే ఏమనాలి.. బైక్ పై ప్రమాదకరంగా పిల్లలను వేలాడదీశాడు. అంతేకాదు అతడేదో పెద్ద ఘన కార్య చేసినట్టు ఫీల్ అవుతూ.. బచ్ పన్ కా ప్యార్ అంటూ పిల్లలతో పాటలు పాడించాడు. ఆ వ్యక్తి తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏంటీ పని అంటూ పైర్ అవుతున్నారు. అసలు చిన్న పిల్లలతో ఆ సహసాలు ఏంటి.. నిజంగా మనిషేనా అతడి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ పిల్లల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు.

    ముఖ్యంగా బైక్ పై ఆ పిల్లలను కూర్చోపెట్టుకున్న తీరు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చివరికి తన భుజాలపైనా ఎక్కించుకున్నాడు. అటు ఇటు పిల్లలను ఇష్టం వచ్చినట్టు వేలాడదీశాడు. అందరూ ప్రమాదంలో ఉన్నారని తెలిసినా వేగంగా రోడ్డుపై దూసుకెళ్తో ఆవీడియో షూట్ చేయించాడు. ఆ వ్యక్తి ఇంత ప్రమాదకరంగా బైక్ నడుపుతుంటే పక్కనే మరొకరు వీడియో తీశారు. సరదా కోసం చేశాడో, పాపులారిటీ కోసం చేశాడో తెలీదు కానీ, అతడు చేసిన పిచ్చి పనిని అంతా తప్పుపడుతున్నారు.  http://




    ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ వ్యక్తి ఎవరు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడిన ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేయాలని, బుద్ధి చెప్పాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.
    Published by:Nagesh Paina
    First published: