ONE DAY BEFORE OF INDEPENDENCE DAY FIRST POSTAGE STAMP PHOTO GOES VIRAL ON SOCIAL MEDIA NK
1947 postage stamp: మళ్లీ వైరల్ అయిన మొదటి స్టాంప్..!
మొదటి పోస్టేజ్ స్టాంప్ (image credit - twitter)
1947 postage stamp: ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా... మొదటి పోస్టేజ్ స్టాంపును రిలీజ్ చేశారు. రేపు 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ స్టాంప్ ప్రత్యేకతలు తెలుసుకుందాం.
1947 postage stamp: సోషల్ మీడియాలో నెటిజన్లు తెలివైన వారు... తమకు ఎప్పుడు ఏం కావాలో వారికి బాగా తెలుసు. ఆదివారం 75వ స్వాతంత్ర్య దినోత్సవం (74 ఏళ్లు పూర్తై... 75లోకి అడుగుపెడుతున్న సందర్భం) సందర్భంగా... ఇప్పుడు నెటిజన్లు దేశభక్తిలోకి వెళ్లిపోయారు. ఎప్పుడో 1947లో స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో రిలీజ్ చేసిన పోస్టేజ్ స్టాంపును ఇప్పుడు షేర్ చేసుకుంటూ... దేశభక్తిని చాటుకుంటున్నారు. ఫలితంగా ఆ స్టాంప్ వైరల్ అయ్యింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్... అప్పటి స్టాంపును ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా ఈ స్టాంపును రిలీజ్ చేశారని తెలిపారు.
ఈ స్టాంపు చాలా ఆసక్తిగా ఉంది. దీనిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. మెట్లు ఎక్కి పైకి వచ్చి... జెండా ఆవిష్కరించినట్లుగా బొమ్మ ఉంది. 15 ఆగస్ట్ 1947 అని రాశారు. జైహింద్ (Long Live India) అని దేశ ఐక్యతను హిందీ అక్షరాలతో చాటారు. ఆ ట్వీట్ ఇక్కడ చూడండి.
ఈసారి కేంద్ర ప్రభుత్వం 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత మహోత్సవం జరుపుతోంది. ఈ క్యాంపెయిన్ మార్చి 12న ప్రారంభమైంది. ఇది 75 రోజులు పూర్తి చేసుకొని... వచ్చే సంవత్సరం ఆగస్ట్ 15 నాటికి ముగుస్తుంది. అప్పటికి ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి.. 75 సంవత్సరాలు పూర్తై.. 76వ వసంతంలోకి అడుగుపెడుతుంది.
ఈ స్టాంపును 1947 నవంబర్ 21న విడుదల చేశారు. అప్పట్లో దాని విలువ మూడున్నర అణాలు (three and one-half annas). విదేశీయుల కోసం దీన్ని తయారుచేశారు. రెండో స్టాంపును దేశీయ అవసరాల కోసం 1947 డిసెంబర్ 15న రిలీజ్ చేశారు. దాన్ని అశోక లయన్ క్యాపిటల్ స్టాంప్ అని పిలిచారు. దాని విలువ ఒకటిన్నర అణా. ఇలాంటిదే ఎగిరే విమానం స్టాంప్ ఒకటి 1947 డిసెంబర్ 15నే రిలీజైంది. దానిపై ఎగిరే విమానం ఉంది.
Another stamp released of a flying aircraft was issued on December 15, 1947.
Two more stamps issued in 1980, depicting Mahatma Gandhi's Dandi March and Salt Satyagraha. pic.twitter.com/NgrRxtd6N0
మరో ట్వీట్లో మంత్రి వైష్ణవ్... రెండు స్టాంపులను చూపించారు. మహాత్మాగాంధీ దండి మార్చ్, ఉప్పు సత్యాగ్రహాన్ని స్మరిస్తూ... 1980లో వాటిని రిలీజ్ చేసినట్లు తెలిపారు.
A set of two stamps was issued on
02.10.1980 depicting the Dandi March and Salt Satyagraha - an epic non-violent protest in India’s freedom movement. #AzadiKaAmritMahotsavpic.twitter.com/6s5OsaafPy
మరో ట్వీట్లో మంత్రి వైష్ణవ్... క్విట్ ఇండియా ఉద్యమాన్ని పురస్కరించుకొని రూపొందించిన స్టాంపును చూపించారు. దీన్ని కూడా 1980 అక్టోబర్ 1న రిలీజ్ చేసినట్లు తెలిపారు.
The Quit India movement was an important milestone in the freedom struggle. The call for ‘do or die’ galvanised the masses like never before.
Stamp released on 01 Oct 1967. #AzadiKaAmritMahotsavpic.twitter.com/mN7HPEbC5f
మంత్రి వైష్ణవ్ ట్వీట్లు... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వీటిని మెచ్చుకుంటున్నారు. ఇండియాకి గర్వకారణం అనీ... చరిత్రాత్మకం అని రకరకాలుగా మెచ్చుకోలు కామెంట్స్ పెడుతున్నరు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.