యూ కాంట్ చీట్ మీ... డమ్మీ బొమ్మని కాలితో తన్నిన గుర్రం... వైరల్ వీడియో...

ఆ గుర్రానికి డమ్మీ బొమ్మను ఇచ్చిందెవరు? అది నిజమైన గుర్రం కాదని తల్లి గుర్రం ఎలా గుర్తుపట్టింది?

news18-telugu
Updated: July 12, 2020, 9:35 AM IST
యూ కాంట్ చీట్ మీ... డమ్మీ బొమ్మని కాలితో తన్నిన గుర్రం... వైరల్ వీడియో...
యూ కాంట్ చీట్ మీ... డమ్మీ బొమ్మని కాలితో తన్నిన గుర్రం.....(credit - twitter)
  • Share this:
ఈ సృష్టిలో తల్లిబిడ్డల మధ్య విడదీయరాని బంధం ఉంటుంది. అనురాగం, ఆప్యాయతలతో అది నిండివుంటుంది. ఎవరైనా ఆ తల్లీబిడ్డల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నా అది నిలబడదు. మనషుల్లోనే కాదు... ప్రాణికోటి లోనూ ఇలాంటి లక్షణం కనిపిస్తుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఘటన. రెగ్యులర్‌గా వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసే ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద... మరోసారి ఓ చక్కటి మెసేజ్ ఉన్న వీడియోని ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నారు. ఇందులో... ఓ గుర్రం దగ్గర ఎవరో చిన్న బొమ్మ గుర్రాన్ని ఉంచారు. అది నిజమైన గుర్రం పిల్లే అనుకున్న తల్లి గుర్రం... దాన్ని ఆప్యాయంగా నిమిరింది. తలతో... దాన్ని రుద్దింది.

తల్లి గుర్రం ఏం చేసినా... పిల్ల గుర్రంలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. దాంతో... అంది నిజమైన పిల్ల గుర్రం కాదనీ... డమ్మీ బొమ్మ అని తల్లి గుర్తించింది. రెండడుగులు ముందుకేసి... వెనక కాలితో... ఒక్క తన్ను తన్నింది. దాంతో... డమ్మీ గుర్రం బొమ్మ ఎగిరిపడింది. తల్లిని ఎవరూ మోసం చేయలేరు అని దీనికి క్యాప్షన్ పెట్టారు సుశాంత నంద.



ఇప్పటికే ఎన్నో ఇలాంటి వీడియోలు పెట్టి... అందర్నీ ఆకర్షించే సుశాంత నందా... ఈ వీడియోతోనూ మరోసారి నెటిజన్లను అలరిస్తున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 12, 2020, 9:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading