తెలంగాణలో కల్లు ప్రియులకు కొదవ లేదు.. రెడీమేడ్ గా వేల రూపాయల విలువ చేసే ఆల్కహాల్ వచ్చిన తర్వాత కూడా సాంప్రదాయికంగా కొనసాగే కల్లు డిమాండ్ మాత్రం ఎప్పటికి తగ్గదు.. ఇక నగరాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అయితే కల్లు కోసం ముందే క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే కల్లు చాలా స్పెషల్ దాని కోసం క్యూ కట్టడమే కాదు.. ముందుగా అడ్వాన్స్ ఇచ్చిన వారికే ఆ కల్లు లభిస్తోంది. అది కూడా ఒక్కో సీసా సాధరణం కంటే రెండింతలు ఎక్కువ.. అంటే ఒక్కో బాటిల్ కల్లు 500 రూపాయలంటే అర్థం చేసుకోవచ్చు. దాని డిమాండ్ ఎంతుందో..
ఈ కల్లు ప్రత్యేకత ఏంటంటే..దీన్ని జీలుగ కల్లు అంటారు. సాధారణ కల్లు కంటే చాలా రుచిగా ఉంటుందని చెబుతారు. మరోవైపు ఇది తాగడం వల్ల షుగర్ , కిడ్నీలో రాళ్లు కూడా రావని చెబుతుంటారు. ఇలాంటి లాభాలతో కూడిన కల్లు కావడంతో దీనికి ప్రత్యేకంగా ఇంత డిమాండ్ ఉందంటున్నారు. ఇంతకి ఈ కల్లు ఎక్కడ దొరుకుతుందంటే.. సూర్యాపేటకు సమీపంలోని కాసరాబాదలో లభిస్తోంది.కాగా ఈ గ్రామానికి చెందిన సైదులు సుమారు 15 సంవత్సరాల క్రితం జీలుగ చెట్ల కల్లు గీసేందుకు చత్తీస్‌ఘడ్‌కు వెళ్లాడు. వారికి కల్లు గీయడం నేర్పించిన తర్వాత వాటి విత్తనాలను కొన్నింటిని తీసుకువచ్చి గ్రామంలో నాటాడు..కాగా చేట్లకు గత మూడు సంవత్సరాల నుండి కల్లు పారుతుండడంతో సేల్ చేస్తున్నారు. సాధారణ కల్లుకంటే టేస్టీగా ఉండడంతోపాటు అదనపు ఆరోగ్యపరమైన లాభాలు కూడా ఉండడంతో ఆ కల్లుకు ముందుగా అర్డర్స్ ఇస్తే తప్ప లభించని పరిస్థితి ఉంటుంది. అందుకే ఒక్కో సీసా 500కు అమ్ముతున్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.