Home /News /trending /

ONCE UPON A TIME ANCHOR IN AFGHANISTAN NOW SELLING STREET FOOD ON ROAD TO FEED HIS FAMILY AK

Viral Photo: తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్థాన్ ఎలా ఉందో చెప్పేందుకు ఈ ఒక్క ఫోటో చాలు.. స్టోరీ చదవితే మీరూ ఒప్పుకుంటారు

(Image: Twitter)

(Image: Twitter)

Trending Story: కబీర్ హక్మల్‌ రాసిన మొహమ్మదీ కథ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.

    ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న దేశాన్ని తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan) పేదరికం, జీవనోపాధి కోసం పోరాడుతున్న అనేక మందికి సంబంధించిన కష్టాలు గురించి మనం రోజూ వింటూనే ఉన్నాం. ఇంతకుముందు హమీద్ కర్జాయ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన కబీర్ హక్మల్ ఇటీవలి ట్విట్టర్ పోస్ట్‌లో దేశంలో ఎంత మంది ప్రతిభావంతులైన నిపుణులు ఉద్యోగాలు లేకపోవడంతో పేదరికం(Poverty) వలయంలోకి నెట్టబడ్డారో చెప్పే ప్రయత్నం చేశారు. హక్మల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆఫ్ఘన్ జర్నలిస్ట్(Journalist) మూసా మొహమ్మదీ ఫోటోను పంచుకున్నాడు. మొహమ్మదీ కొన్నేళ్లుగా మీడియా రంగంలో భాగమని పేర్కొన్నాడు.

    అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల మధ్య అతను ఇప్పుడు అవసరాలను తీర్చడానికి ఆహారాన్ని విక్రయిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. మూసా మొహమ్మది సంవత్సరాల తరబడి వివిధ టీవీ ఛానెల్‌లలో యాంకర్‌ అండ్ రిపోర్టర్‌గా పనిచేశాడని.. అయితే ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించడానికి అతడికి ఆదాయం లేదని తెలిపాడు. కొంత డబ్బు సంపాదించడానికి వీధిలో ఆహారాన్ని విక్రయిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. రిపబ్లిక్ పతనం తర్వాత ఆఫ్ఘన్‌లు అపూర్వమైన పేదరికానికి గురవుతున్నారని తన క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు.



    కబీర్ హక్మల్‌ రాసిన మొహమ్మదీ కథ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ మాజీ టీవీ యాంకర్, రిపోర్టర్‌ను తన విభాగానికి నియమించుకుంటానని ట్వీట్ చేశారు. ఇక ఆఫ్ఘనిస్థాన్‌ను తమ అధీనంలోకి తీసుకోవడానికి ముందు తాము మారిపోయామని.. గతంలో మాదిరిగా ఉండబోమని చెప్పిన మాటలన్నీ ఉత్తవే అని తేలిపోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.

    దేశం తమ ఆధీనంలోకి వచ్చిన తరువాత వారి అరాచకాలు గతంలో మాదిరిగానే కొనసాగుతున్నాయి. దీంతో ఆ దేశ పౌరులు మళ్లీ కొన్ని దశాబ్దాల పాటు వెనక్కి వెళ్లిపోయినట్టు భావిస్తున్నారు. కొందరు తాలిబన్ల పాలనను ముందుగానే ఊహించి దేశం విడిచి వెళ్లిపోగా.. మరికొందరు మాత్రం దేశం విడిచి ఎటూ వెళ్లలేక.. అలాగని దేశంలో బతకలేక నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఆఫ్ఘన్ల ఆకలి తీర్చేందుకు భారత్ సహా పలు ప్రపంచ దేశాలు ముందుకొచ్చి సాయం చేస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Trending news, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు