Home /News /trending /

ONCE IN A 6 00 000 YEARS ASTEROID TO COME CLOSE TO EARTH NASA DUBS IT POTENTIALLY HAZARDOUS GH VB

Asteroid: భూమివైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్.. మానవాళికి ప్రమాదం తప్పదా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అంతరిక్షం నుంచి మరో ఆస్టరాయిడ్(Astoroid) భూమివైపు దూసుకొస్తోంది. సుమారు ఆరు లక్షల ఏళ్లక్రితం ఏర్పడినట్లుగా చెబుతున్న ఈ గ్రహశకలం 2022 జనవరి 18న భూమిని ఢీకొనే అవకాశం ఉందని నాసా(NASA) శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

అంతరిక్షం నుంచి మరో ఆస్టరాయిడ్(Astoroid) భూమివైపు దూసుకొస్తోంది. సుమారు ఆరు లక్షల ఏళ్లక్రితం ఏర్పడినట్లుగా చెబుతున్న ఈ గ్రహశకలం 2022 జనవరి 18న భూమిని ఢీకొనే అవకాశం ఉందని నాసా(NASA) శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 7482 (1994 PC1)గా పిలుస్తున్న ఈ గ్రహశకలం దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతోందని.. మరికొన్ని వారాల్లో భూమిని(Earth) ఢీకొట్టే అవకాశం ఉందని నాసా ప్రకటించింది. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం.. అంటే సౌర వ్యవస్థ ఏర్పడిన సమయంలో మిగిలిపోయిన ఆస్టరాయిడ్​ అని పేర్కొంది. ఈ మేరకు గ్రహశకలాల కదలికలపై అధ్యయనం జరిపే జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (Jet propulsion laboratory) కీలక అంశాలను వెల్లడించింది.

Crisis: భారీ ఆర్థిక సంక్షోభంలో పొరుగు దేశం.. చుక్కలనంటిన ధరలతో విలవిల..


7482 (1994 PC1) ఆస్టరాయిడ్ గంటకు 70,416 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ భూమివైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం భూమి నుంచి 1.93 మిలియన్ కిమీ దూరంలో ఉంది. అంటే భూమి- చంద్రుడి మధ్య దూరం కన్నా 5.15 రెట్లు అధికం. ఇది సుమారు 1 కిలోమీటర్ భారీ వ్యాసార్థం కలిగి ఉంది. అమెరికాలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే 2.5 రెట్లు ఎత్తు అధికం.

భూమికి ప్రమాదం తప్పదా?
ఆస్టరాయిడ్(Asteroids) ప్రభావం భూమిపై ఉండనప్పటికీ.. ఈ తరహా గ్రహశకలాలు ప్రతి ఆరు లక్షల సంవత్సరాలకు ఒకసారి భూ గ్రహాన్ని ఢీకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు భూమికి సమీపంలో ఉన్న గ్రహశకలాలు, తోకచుక్కలు సూర్యుని నుంచి 195 మిలియన్ కిలోమీటర్ల పరిధిలో ఉంటాయని జేపీఎల్ చెబుతోంది. అంటే అవి భూ కక్ష్యకు సమీపంలోనే పరిభ్రమిస్తుంటాయి. అయితే ఈ గ్రహశకలాల్లో కొన్ని మాత్రమే ప్రమాదకరమైనవి అని పేర్కొంది.

200ఏళ్ల వరకు నో ప్రాబ్లమ్..
భూమికి సమీపంలో ఉన్న 26,000 ఆస్టరాయిడ్​లను నాసా ట్రాక్ చేస్తోంది. వీటిలో వెయ్యికి పైగా శకలాలు మాత్రమే ప్రమాదకరమైనవిగా పరిగణిస్తోంది. ప్రస్తుత 7482 (1994 PC1)ను ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీని ఉపయోగించి రాబర్ట్ మెక్​నాట్ 1994 ఆగస్టు 9న తొలిసారిగా కనుగొన్నారు.

Jobs In Wipro: BCA, BSc గ్రాడ్యుయేట్లకు విప్రో గుడ్​న్యూస్​.. నెలకు రూ.23 వేల వేతనంతో ఉద్యోగాలు..


వివిధ స్కాన్​ల ప్రకారం 1974 నుంచి దీనికి సంబంధించిన డేటా అందుబాటులో ఉంది. అంటే దీని కక్ష్య 47 సంవత్సరాలకు పైగా పరిశీలనలలో ఉంది. మరో 200 సంవత్సరాల వరకు మరే ఇతర గ్రహశకలం భూమికి ఇంత దగ్గరగా రాదని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ(JPL) స్పష్టం చేసింది. 2022 మొదటి వారంలో మూడు గ్రహశకలాలు భూమికి దగ్గరగా చేరాయి. ఈ నెల మొదటి వారంలో భూ కక్ష్యకు దగ్గరగా వచ్చే ఈ మూడింట్లో 22021 YQ పరిమాణంలో అతిపెద్దది.
Published by:Veera Babu
First published:

Tags: Trending news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు