Viral Video : ఈ వధూవరులు చేసిన పనికి బంధువులంతా షాక్.. వైరలవుతున్న వీడియో..

Photo Credit : Instagram

Viral Video : సరదా కోసం చేస్తున్నారో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ, పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు చేసే పనులు అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

  • Share this:
    సోషల్ మీడియాలో (Social Media) ప్రతి రోజూ ఎన్నో వీడియాలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా నవ్వించే వీడియోలే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భయంకరమైన వీడియోలు సైతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. ఇక, ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. జనాలు కూడా ఇలాంటి వీడియోలను ఇష్టపడటమే ఇందుకు కారణం. సోషల్ మీడియా ప్రభావమో మరో కారణమో కానీ.. ఈ మధ్య కాలంలో వింత పనులకు పెళ్లి మండపాలు వేదికవుతున్నాయి. తాళి కట్టే సమయంలో వధూవరులు చేసే పనులు వైరల్ అవుతున్నాయి. సరదా కోసం చేస్తున్నారో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ, పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు చేసే పనులు అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. జీవితంలో పెళ్లి వేడుకలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల పెళ్లి ట్రెండ్ మారింది. పెళ్లిలో సందడి మరింత పెరిగింది. దీంతో వధూవరులు చేస్తున్న వింత పనులు వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల తెలంగాణలోని ఒక వధువు ‘బుల్లెట్టు బండి’ పాటకు డ్యాన్స్ వేసినప్పటి వీడియో విపరీతంగా చక్కర్లు కొట్టింది. తాజాగా ఇలాంటి మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

    సాధారణంగా పెళ్లి జరిగేటప్పుడు వధూవరుల స్నేహితులు, రక్తసంబంధీకులు చేసే సందడి ఆకర్షణగా ఉండేది. ఇప్పుడు పెళ్లికూతురు లేదా పెళ్లికొడుకు సొంతంగా ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చేలా వివాహ వేడుకలను ప్లాన్ చేసుకుంటున్నారు. తాజా వీడియోలో కన్పించే వధూవరులు కూడా ఇదే పని చేశారు.

    ఇంతకీ ఆ వధూవరులు ఏం చేశారంటే.. నైట్ డ్రెస్ లు (ట్రాక్ షూట్ లు) వేసుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ పనికి వివాహానికి వచ్చిన బంధువులంతా షాకయ్యారు. ఇక, అదే డ్రెస్ లో పెళ్లి కొడుకు.. వధువుకి అదిరిపోయే కిస్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Wild Wood Films అనే ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేశారు.

    ఇది కూడా చదవండి : ఐపీఎల్ నయా బ్యూటీ క్వీన్, కుర్రాళ్ల క్రష్... తమన్నా..! ఆమె గురించి ఈ విషయాలు తెలుసా...?

    ఇక, ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వాళ్లకి ఆ డ్రెస్ లో పెళ్లి చేసుకోవడం కంఫర్ట్ అనుకుంటా అని కొందరు కామెంట్ చేస్తుంటే.. వైరల్ అవ్వడానికి ఇలాంటి పనులు చేస్తున్నారంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఏడు లక్షలకు పైగా లైకులు వచ్చాయ్.
    Published by:Sridhar Reddy
    First published: