సన్ డే అంటే ఫన్ డే అని బిగ్ బాస్ రియాల్టీ షోలో నాగార్జున అంటుంటారు. ఆ డైలాగ్ అక్కడ బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే సన్ డే ప్రతీ ఒక్కరికి సెలవు కాబట్టి.. వ్యాపారాలు చేసే వారు, ఉద్యోగం చేసే వారు కూడా కుటుంబసభ్యులతో కలిసి కాస్తంత టైమ్ కేటాయిస్తారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. వాళ్ల ఇన్ స్టాగ్రామ్ లో తమ ఫొటోలను... వీడియోలోను షేర్ చేసుకుంటూ ఉంటారు. వారి వ్యక్తిగత విషయాలను కూడా ఇన్ స్టాగ్రామ్ లోనే అభిమానులతో పంచుకుంటారు. ఇలా నేడు ఆదివారం రోజున కొంతమంది సెలబ్రెటీలు వాళ్ల ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలను షేర్ చేశారు.
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
కొంతమంది హాట్ ఫొటోలను షేర్ చేయగా.. మరికొంత మంది డ్యాన్స్ లు చేసుకుంటూ వీడియోలను పోస్టు చేశారు. మరికొంత మంది రెగ్యూలర్ యాక్టివిటీలో భాగంగా వీడియలను రికార్డు చేసి ఇన్ స్టాలో పోస్టు చేశారు. ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారియి.
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ముందుగా యువ కథానాయిక రష్మికి శునకాలంటే చాలా ప్రేమ. ఆదివారం పూట తన పెంపుడు శునకంతో సరదాగా ఆడుకుంటున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు ఒక రోజు ముందుగానే పోస్టు చేయగా.. ప్రస్తుతం వైరల్ గా మారాయి. చిరంజీవి ఈ రోజు గల్లీ రౌడీ కి సంబంధించి ట్రైలర్ ను లాంచ్ చేశారు.
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
దానికి సంబంధించి వీడియోలు, ఫొటోలను ‘గల్లీ రౌడీ’ హీరో సందీప్ కిషన్ పోస్టు చేశారు. అవి విపరీతంగా వైరల్ గా మారాయి. హీరో మహేశ్ బాబు తనయుడు గౌతమ్, అతని స్నేహితులు ఇంటి వద్ద ఆడుకుంటున్న ఫోటోలను, వీడియోలను నమ్రత షేర్ చేశారు. స్లిమ్ గా ఉండే విష్ణు ప్రియ ఇటీవల తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
వరుసగా రెండు ఒలంపిక్స్ లో పతకాలు సాధించిన బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొణెను కలిశారు. ముగ్గురూ కలసి దిగిన గ్రూపీ ఇన్‌స్టాలో చక్కర్లు కొడుతోంది. అంతే కాకుండా ఈ రోజు మరో ఘటన జరిగింది. అదే మన తెలుగులో బంపర్ హిట్ అందుకునన్న ‘హిట్’ సినిమా బాలీవుడ్ లోకి వెళ్తుండగా.. దానికి సంబంధించి ముహూర్తం ఈ రోజే జరిగింది.
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
దానికి సంబంధించి కూడా ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు వైరల్ గా మారాయి. అంతే కాకుండా.. బిగ్ బాస్ సీజన్ ఫోర్ బ్యూటీ హారిక కూడా క్యూట్ డ్యాన్స్ ను ఇన్ స్టాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ గా మారింది. మరి ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు తమ ఫొటోలను, వీడియోలను తమ అభిమనులతో పంచుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashu reddy, Celebrities, Deepika pille, Hot photos, Instagram, Pv sindhu, Rashmi cute photos, Vishnu Priya