కొన్ని సార్లు.. వాహనాలు అదుపు తప్పి ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి. మనం తరుచుగా టూవీలర్స్, ఫోర్ వీలర్ వెహికిల్స్ వాహనాలు రోడ్డుప్రమాదానికి గురవ్వడం చూస్తుంటాం. భారీ వర్షం వలన లేదా కొన్ని సార్లు బ్రేకులు ఫెయిల్ కావడం వలన కూడా వాహనాలు ప్రమాదానికి గురౌతుంటాయి. చూస్తుండగానే.. ఘోరమైన రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘెర ప్రమాదం ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. కర్ణాటకలో (Karnataka) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కుందాపూర్ సమీపంలో ఉన్న షిరూర్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక అంబూలెన్స్ వేగంగా వస్తుంది. అక్కడ వర్షంకూడా భారీగా కురుస్తుంది. ఈ క్రమంలో.. అంబులెన్స్ సైరన్ ను విన్న సిబ్బంది.. పరిగెత్తుకుంటు బైటకు వచ్చారు. అడ్డుగా ఉన్న బారికెడ్లను తొలగిస్తున్నారు.
Horrific accident of Ambulance at Shirur toll plaza near #Kundapur just now @dp_satish @prakash_TNIE @Lolita_TNIE @BoskyKhanna pic.twitter.com/b9HEknGVRx
— Dr Durgaprasad Hegde (@DpHegde) July 20, 2022
ఇంతలో.. డ్రైవర్ సడెన్ గా స్పీడ్ బ్రేక్ వేసిట్టున్నాడు. అసలే.. వర్షం.. ఆపైన స్పీడ్.. దీంతో అంబూలెన్స్ అదుపు తప్పి బోర్లా పడింది. అదే విధంగా.. బోర్లుకుంటూ.. అక్కడే ఉన్న టోల్ బూత్ కు గుద్దుకుంది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్ లోనే చనిపోయినట్లు సమాచారం. అంబూలెన్స్ లో ఉన్న వస్తువులు అన్న చెల్లాచెదురుగా బయట పడ్డాయి. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (viral video) మారింది.
ఇదిలా ఉండగా వెడ్డింగ్ రిసెప్షన్ లో షాకింగ్ ఘటన జరిగింది.
హవాయి బిగ్ ఐలాండ్ పశ్చిమ తీరంలో కైలువా-కోనాలోని హులిహీ ప్యాలెస్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న హోటల్ లో పెళ్లి రిసెప్షన్ వేడుకను ప్లాన్ చేశారు. అప్పుడు బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున అక్కడ హజరయ్యారు. కార్యక్రమం ఎంతో సందడిగా జరుగుతుంది. అతిథులంతా.. పార్టీలో నిమగ్నమయ్యారు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. హవాయిలో సముద్రతీర వివాహ వేడుకలో భారీ అలల శ్రేణిని ఢీకొట్టింది.
దీంతో అక్కడి వారు.. భయంతో దూరంగా పరుగులు పెట్టారు. చూస్తుండగానే.. వెంట వెంటనే అలలు, ఒడ్డువైపునకు వచ్చాయి. దీంతో అతిథులు భయంతో పరుగులు పెట్టారు. కొంత మంది నీళ్లలో తడిసిపోయారు. అక్కడ ఉన్న కుర్చీలు, పదార్థాలంతా నీళ్లలో తడిసిపోయాయి. అక్కడి వారు.. ఈ ఘటనను వీడియో తీస్తున్నారు. ప్రస్తుతంఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా (Viral video) మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Free ambulance, Karnataka, Viral Video