హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: బైక్‌పై హద్దులు దాటిన రొమాన్స్‌!

Viral Video: బైక్‌పై హద్దులు దాటిన రొమాన్స్‌!

బైక్‌పై రొమాన్స్‌

బైక్‌పై రొమాన్స్‌

పోలీసులు తగిన గుణపాఠం చెప్పినా ఎక్కడో అక్కడ మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అందులో రాజస్థాన్‌లో ఇదేదో ట్రెండ్‌ లాగా మారిపోయినట్లుంది.. గత నెలలో రాజస్థాన్ అజ్మీర్‌లో ఒక కాలేజ్ క్రాస్ రోడ్డు వద్ద ప్రేమ జంట బైక్‌పై రొమాన్స్ చేసుకుంటూ వెళ్లడం హాట్ టాపిక్‌గా మారిన ఘటన మారవకముందే అలాంటి ఘటనే జైపూర్‌లో జరిగింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ మధ్య బైక్‌పై రొమాన్స్‌ ఫ్యాషన్‌ ఐపోయింది. బైక్‌పై రొమాన్స్‌ చేస్తున్న లవర్స్‌ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.. ఈ తరహా 'అతి' దాదాపు అన్ని రాష్ట్రాలకు పాకింది. పట్టపగలు నడిరోడ్డుపై బైక్‌పై ముద్దులతో, హగ్గులతో రెచ్చిపోతున్నారు. పోలీసులు తగిన గుణపాఠం చెప్పినా ఎక్కడో అక్కడ మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అందులో రాజస్థాన్‌లో ఇదేదో ట్రెండ్‌ లాగా మారిపోయినట్లుంది.. గత నెలలో రాజస్థాన్ అజ్మీర్‌లో ఒక కాలేజ్ క్రాస్ రోడ్డు వద్ద ప్రేమ జంట బైక్‌పై రొమాన్స్ చేసుకుంటూ వెళ్లడం హాట్ టాపిక్‌గా మారిన ఘటన మారవకముందే అలాంటి ఘటనే జైపూర్‌లో జరిగింది.

హోలీ రొమాన్స్‌:

హోలీ సందర్భంగా జైపూర్ వీధుల్లో బైక్‌పై రొమాన్స్ చేస్తున్న జంట కోసం రాజస్థాన్ పోలీసులు గాలిస్తున్నారు. జైపూర్‌లోని బీ-2 బైపాస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హోలీ కావడంతో ఓ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తూ మొబైల్ కెమెరాకు చిక్కింది. ఈ వీడియోను కారులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు చిత్రీకరించాడు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొన్న లవర్‌.. ప్రేమికుడిని హగ్‌ చేసుకోని ఉంది. వీడియో రికార్డు చేస్తున్నారని తెలిసినా కూడా ఆమె ఏ మాత్రం భయపడలేదు.. అతను కూడా తనకేమీ పట్టనట్లు అలానే కంటిన్యూ చేశాడు. నడిరోడ్డుపై మిగిలిన వాళ్లు ఏం అనుకుంటారని ఏ మాత్రం ఆలోచించకుండా డ్రైవ్ చేశాడు.. చూసిన వాళ్లు మాత్రం ముక్కున వేలు వేసుకున్నారు. ఇది పబ్లిక్ డిస్టబెన్స్ కాకపోతే మరేంటి..! బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ లవ్‌ బర్డ్స్‌కు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

గతంలోనూ ఈ తరహా ఘటనలు:

ఇటీవల కాలంలో పలువురు అమ్మాయిలు , అబ్బాయిలు బైక్‌పై రైడ్ చేస్తూ కిస్సులతో , హగ్గులతో రెచ్చిపోతూ రోడ్డు మీద ప్రయాణిస్తున్న వాళ్లకు షాక్ ఇస్తున్నారు. ఇలాంటి వాళ్లపై పోలీసులు కేసులు పెడుతున్నా లెక్క చేయడమే లేదు. నడిరోడ్డు మీదే యువతీ యువకులు.. పగలు, రాత్రి తేడా లేకుండా ఇలా చేస్తున్నారు. ప్రేమ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తూ వెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అది చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు లవర్స్‌కి సపోర్ట్ ఇస్తుంటే.. మరికొందరు పబ్లిక్‌గా ఇదేంపాడు పని అంటూ విమర్శిస్తున్నారు. గత నెలలో చత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు జరిగాయి.

First published:

Tags: Jaipur, Rajasthan