• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • ON CAMERA ELEPHANT IN KERALA USES TRUNK TO HELP CALF OVER BARRIER SK

తల్లి ప్రేమ అంటే ఇదే.. మనుషులైనా.. జంతువులైనా..అమ్మ అమ్మే..

తల్లి ప్రేమ అంటే ఇదే.. మనుషులైనా.. జంతువులైనా..అమ్మ అమ్మే..

పిల్ల ఏనుగును రోడ్డు దాటిస్తున్న తల్లి

ఈ వీడియోను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా ట్వీట్ చేశారు. ఆ ఏనుగులు వెళ్లే వరకు వేచిచూసిన లారీ డ్రైవర్లను ఆయన అభినందించారు.

  • Share this:
    ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు మించింది ఏదీ లేదు. తమ పిల్లల కోసం దేనికైనా సిద్ధపడుతుంది తల్లి. అది మనుషులైనా.. జంతువులైనా..! అమ్మ..అమ్మే..! ఆమె ప్రేమకు ఏదీ సాటి రాదు. చివరకు దైవం కూడా.. అమ్మ తర్వాతే..! తల్లి ప్రేమకు అద్దంపట్టే ఘటన కేరళలో చోటుచేసుకుంది. రోడ్డు మీద డివైడర్ దాటేందుకు ఇబ్బంది పడుతున్న పిల్ల ఏనుగుకు తల్లి ఏనుగు సాయం చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


    కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను మొదట అనీశ్‌ కటా అనే వ్యక్తి షేర్‌ చేశారు. గురువారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఆయన సైక్లింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో కేరళ-తమిళనాడు సరిహద్దు సమీపంలోని నాడుకనిచురం వద్ద మూడు ఏనుగులు రోడ్డు దాటుతున్నాయి. వీటిలో రెండు సులభంగానే రోడ్డు మీద ఉన్న డివైడర్‌ను దాటాయి. కానీ మరో పిల్ల ఏనుగు మాత్రం దాటలేకపోయింది. పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యింది. దాంతో తల్లి ఏనుగు తన తొండంతో పిల్ల ఏనుగను పైకి లేపి డివైడర్‌ను దాటించింది. ఈ వీడియోను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా ట్వీట్ చేశారు. ఆ ఏనుగులు వెళ్లే వరకు వేచిచూసిన లారీ డ్రైవర్లను ఆయన అభినందించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: