భారత ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) నేడు నేపాల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో.. గౌతమ బుద్ధుని జన్మస్థలమైన నేపాల్ లోని లుంబిని వనాన్ని (Lumbini visit) ప్రధాని మోదీ నేడు సందర్శించనున్నారు. కాగా, నేపాల్, భారత్ ల (Nepal,india) మధ్య స్నేహ పూర్వక సంబంధాలు మరింత బలోపేతం చేసేదిశగా పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. బుద్ధపూర్ణిమ (Budha purnima) సందర్భంగా లుంబినీ వనం సందర్శించడం ప్రాముఖ్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో మోదీ, నేపాల్ ప్రధాని బహదూర్ దేవ్ బాతో పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
అదే విధంగా నేపాల్ లో కొన్ని కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకొనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంలో ప్రధాని మోదీ నేపాల్ లో.. బౌద్ధ సంస్కృతిని తెలిపే వారసత్వ కేంద్రానికి శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా, మోదీ 2014 లో ప్రధాని అయినప్పటి నుంచి నేపాల్‌కు ఐదవ పర్యటించారు.అదే విధంగా, నేడు తొలిసారి లుంబినీకి వెళ్తున్నారు. ఖుషీనగర్ లో గౌతమ బుద్ధుడు మోక్షం పొందాడని ప్రతితీ. ఈ పర్యటనలో మోదీ.. మాయాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేయనున్నారు.
లుంబినీ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే బుద్ధ జయంతి వేడుకల్లో ఆయన ప్రసంగిస్తారు. భారతదేశం నిర్మించడానికి సహాయం చేస్తున్న లుంబినీ సన్యాసుల జోన్లో బౌద్ధ సంస్కృతి, వారసత్వ కేంద్రం కోసం కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. నెల క్రితమే నేపాల్ ప్రధాని బహదూర్ దేవ్ బా భారత్ కు మూడురోజుల పాటు పర్యటన కోసం వచ్చిన విషయం తెలిసిందే. ప్రధానంగా, భారత్, నేపాల్ ద్వైపాక్షిక సమావేశాలకు సంబంధించిన ఎజెండాలను పేర్కొననప్పటికీ, సోమవారం ఐదు అవగాహన ఒప్పందాలు (ఎంఓయులు) సంతకాలు అధికార వర్గాలు తెలిపాయి.
వాటిలో ప్రముఖమైనవి - ఇండియన్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఫౌండేషన్ లుంబినీ బౌద్ధ విశ్వవిద్యాలయం, త్రిభువన్ యూనివర్శిటీలతో ఒక్కొక్క అవగాహన ఒప్పందాన్ని, ఖాట్మండు విశ్వవిద్యాలయంతో మూడు అవగాహన ఒప్పందాలపై సంతకం చేస్తుంది. అదే విధంగా, లుంబినీ బౌద్ధ విశ్వవిద్యాలయం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR), త్రిభువన్ యూనివర్శిటీ నేపాల్ మరియు సెంటర్ ఫర్ ఏషియన్ స్టడీస్ (CNAS), ICCR, ఖాట్మండు విశ్వవిద్యాలయం మరియు ICCR, KU చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరో రెండు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నాయి.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.