OMICRON CASES CROSS 300MARK IN INDIA PM MODI REVIEWS SITUATION STATES PUT UP CURBS TO DETER VARIANT MKS
Nationwide night lockdown -ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు -భారత్లో Omicron ఉధృతి
ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రధాని మోదీ సమీక్ష
ఒమిక్రాన్ పట్ల సర్వత్రా నిర్లక్ష్యభావన వ్యక్తమవుతోన్న దరిమిలా ప్రధాని నరేంద్ర మోదీ కీలక హెచ్చరికలు, సూచనలు చేశారు. ఏడాదిన్నర కిందటి అనుభవం మరోసారి అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా రాత్రి పూట లాక్ డౌన్ విధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. పూర్తి వివరాలివి..
లక్షల మందిని పొట్టనపెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే ఐదారు రెట్లు ప్రమాదకరమైనదిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 100కుపైగా దేశాలకు వ్యాపించింది. బ్రిటన్ లో భారీగా మరణాలూ నమోదవుతున్నాయి. అమెరికాలోనూ చావులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇండియాలోనూ ఒమిక్రాన్ విజృంభిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తున్నది. ఒమిక్రాన్ పట్ల సర్వత్రా నిర్లక్ష్యభావన వ్యక్తమవుతోన్న దరిమిలా ప్రధాని నరేంద్ర మోదీ కీలక హెచ్చరికలు, సూచనలు చేశారు. ఏడాదిన్నర కిందటి అనుభవం మరోసారి అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా రాత్రి పూట లాక్ డౌన్ విధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. పూర్తి వివరాలివి..
కొవిడ్ మహమ్మారిపై యుద్ధం ముగిసిపోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొవిడ్ జాగ్రత్తలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న, కేసులు ఎక్కువగా ఉన్న, ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్న అన్ని రాష్ట్రాలకు బృందాలను పంపి, పరిస్థితిని మెరుగుపరచేందుకు సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. గురువారం కొవిడ్ సమస్యపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో ప్రధాని మోదీ చర్చించారు. ఔషధాలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ బెడ్లు, వ్యాక్సినేషన్ తదితర ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. ఒమైక్రాన్ వేరియంట్ పలు దేశాలను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని సమీక్ష జరిపారు. దేశంలో ఎక్కడెక్కడ ఒమైక్రాన్ వ్యాపిస్తోందో గణాంకాలతో అధికారులు వివరించారు. నవంబరు 25 నుంచి తీసుకున్న చర్యలను సమీక్షించారు. అంతర్జాతీయ ప్రయాణికులను అనుమతించే విషయంలో నిబంధలను మార్చిన విషాన్ని ప్రధానికి వివరించారు. రాష్ట్రాలతో కలిసి పని చేయాలని ప్రధాని అధికారులకు సూచించారు.
దేశంలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండడం.. క్రిస్మస్, కొత్త ఏడాది వేడుకల సందర్భంగా ప్రజలు గుమిగూడే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొవిడ్ మార్గదర్శకాల అమలు, టీకా పంపిణీ కట్టుదిట్టంగా చేపట్టాలని కోరింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం రాష్ట్రాలు/యూటీల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పండుగల నేపథ్యంలో జనం గుమిగూడకుండా ఆంక్షలను విధించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్దేశించారు.
రాష్ట్రాలు.. ముప్పునకు ముందే మేల్కొని ఆంక్షలను అమలు చేయాలని పేర్కొన్నారు. పాజిటివిటీ, కేసుల డబులింగ్ రేటును నిరంతరం పర్యవేక్షించాలని, పెద్దఎత్తున కేసులు నమోదైతే కట్టడి ప్రాంతాలుగా ప్రకటించాలన్నారు. పాజిటివిటీ 10 దాటిన చోట, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 40 శాతానికి మించినచోట స్థానిక కట్టడి వ్యూహాలు అమలు చేయాలని రాజేశ్ భూషణ్ నిర్దేశించారు. టీకా పంపిణీలో జాతీయ సగటు కంటే వెనుకబడిన జిల్లాలపై దృష్టి కేంద్రీకృతం చేయాలని.. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలు టీకా పంపిణీ విస్తృత స్థాయిలో చేపట్టాలని పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.