OMG 14 INCH LONG BANANAS IN 6 ACRES MP FARMER ARVIND JAT INNOVATIVE EXPERIMENT IN BANANA FARMING SK
OMG: ఇంత పొడవైన అరటి పండ్లను మీరెప్పుడూ చూసి ఉండరు.. అచ్చం సొరకాయల్లా..
పొడవైన అరటి పండ్లు
Long Bananas: మనకు తెలిసి.. అరటి పండు ఐదు నుంచి ఆరు అంగుళాల పొడవు ఉంటుంది. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రైతు పొలంలో పండిన అరటి పండ్లు మాత్రం ఏకంగా 14 అంగుళాల పొడవు ఉన్నాయి. చూసేందుకు అచ్చం సొరకాయల్లా ఉన్నాయి.
మనలో చాలా మంది అరటి పండ్లను(Banana) చాలా ఇష్టంగా తింటారు. కొందరు ఉదయాన్నే పాలల్లో అరటి పండును తీసుకుంటారు. రోజుకో అరటి పండును తింటే.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు కూడా చెబుతారు. అయితే మనకు తెలిసి.. అరటి పండు ఐదు నుంచి ఆరు అంగుళాల పొడవు ఉంటుంది. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రైతు పొలంలో పండిన అరటి పండ్లు మాత్రం ఏకంగా 14 అంగుళాల పొడవు ఉన్నాయి. చూసేందుకు అచ్చం సొరకాయల్లా ఉన్నాయి. అంత పొడవుగా ఇవి పెరుగుతున్నాయి. ఈ పొడవైన అరటి పండ్ల గురించి పలు కంపెనీలకు తెలిడయంతో వాటిని కొనేందుకు ఎగబడుతున్నాయి.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని బర్వానీ జిల్లాకు చెందిన అరవింద్ జాట్ (Arvind Jat) అనే రైతు తన పొలంలో అరటి పంటను సాగు చేస్తున్నాడు. ఇటీవల పండ్లు కోతకు వచ్చాయి. అరవింద్ తోటలో పెరిగిన అరటి పండ్లను చూసి చుట్టుపక్కల ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. అవి మనం రోజూ చూసే సాధారణ అరటి పళ్లలా లేవు. చాలా పొడుగ్గా ఉన్నాయి. సొరకాయలు ఎంత పొడవుగా ఉంటాయో.. అంత పెద్దగా పెరిగాయి. స్కేల్ పెట్టి కొలిచి చూస్తే.. దాదాపు 14 అంగుళాలు ఉన్నాయి. ఏంటి.. అరటి కాయలు ఇంత సైజులో ఉన్నాయా? అని స్థానికులు, వ్యాపారులు ముక్కున వేలేసుకుంటున్నారు.
అరవింద్ జాట్ అరటి పండ్ల (Banana Farming) విషయం ముంబై వరకు చేరడంతో.. పలు కంపెనీలు వాటిని కొనేందుకు పోటీపడ్డాయి. చివరకు ఓ ప్రముఖ కంపెనీ అధిక ధర పెట్టి.. మొదటి పంట కింద పండిన 10 టన్నుల అరటి పళ్లను కొనుగోలు చేసింది. సాధారణం కంటే ఎక్కువ రేటు పలకడంతో అరవింద్ జాట్ సంతోషం వ్యక్తం చేశాడు. ఐతే దీని వెనక చాలా కృషి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తన పొలానికి ఆవుపేడకు ఎరువుగా వేశాడు. పంట మార్పిడి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని.. 4 నెలలుగా ఎలాంట పంట వేయలేదు. పొలంలో ఎరువు చల్లి.. 4 నెలలు అలాగే వదిలివేశాడు. భూమి సారవంతమైన తర్వాత అరటి పంటను వేయడంతో.. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇలా మొత్తం 6 ఎకరాల్లో.. లక్షలాది అరటి పండ్లు పండుతున్నాయి.
ప్రస్తుతం ఈ పొడవైన అరటి పండ్లు మార్కెట్లో చర్చనీయాంశంగా మారాయి. బర్వానీకి చెందిన అరటిపండ్లు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇక్కడి పండ్ల సైజు, టేస్ట్‌కి చాలా మంది ఫిదా అయ్యారు. అందుకే ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాలకు మాత్రమే కాదు.. ఇరాక్, ఇజ్రాయెల్‌కు కూడా ఎగుమతి
అవుతున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.