Home /News /trending /

OM PRAKASH RAJBHAR OF UTTAR PRADESH GIVES DIFFERENT PROMISE TO PEOPLE OF TRIPLE RIDING ON BIKE KNOW THE DETAILS AK

ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి.. ఈ నాయకుడి హామీ విని షాక్ అవుతారో లేక నవ్వుకుంటారో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Poll Promise ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఓ నేత ఈ రకమైన హామీని ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. లాజిక్ లేని ఇలాంటి వాగ్దానాలు ఇచ్చారు.

    రాజకీయ నాయకులకు ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యం. ఇందుకోసం చాలామంది నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు ఎంతగానో కష్టపడుతుంటారు. తమ పార్టీకి, తమకు ఓట్ల వర్షం కురిసేందుకు అనేక హామీలు ఇస్తుంటారు. అయితే కొందరు నేతలు ఈ విషయంలో చాలా భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఓట్ల కోసం భిన్నమైన హామీలు ప్రకటిస్తుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఓ నేత ఈ రకమైన హామీని ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. లాజిక్ లేని ఇలాంటి వాగ్దానాలు ఇచ్చారు. సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్ వారణాసిలో ప్రజలకు ఇలాంటి హామీ ఇచ్చి వార్తల్లో నిలిచారు. తమ పార్టీ మద్దతిచ్చిన కూటమి అధికారంలోకి వస్తే ఒకే బైక్‌పై ముగ్గురు హాయిగా ప్రయాణించవచ్చని ఆయన ప్రజలకు సూచించారు. ఇలాంటి వారికి ఎలాంటి జరిమానాలు విధించబోమని ఓంప్రకాష్ రాజ్‌భర్ తన ప్రకటనలో తెలిపారు.

    మోటారు సైకిల్‌పై ఇద్దరు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు అవకాశం ఉందన్న ఆయన... పొరపాటున ముగ్గురు వ్యక్తులు కూర్చుని వెళితే.. పోలీసులు వారికి జరిమానా విధిస్తారని తెలిపారు. అయితే తమ పార్టీ మద్దతు ఇచ్చిన కూటమి అధికారంలోకి వస్తే.. బైక్‌పై ముగ్గురు కూర్చునే అవకాశం ఉంటుందని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాంటి వారికి ఎలాంటి జరిమానాలు విధించబోమని హామీ ఇచ్చారు.

    ఈ హామీ ఇచ్చిన రాజ్‌భర్ మరో వింత లాజిక్ కూడా చెప్పారు. రైలు కోచ్‌లో 70 సీట్లు ఉంటాయని.. కానీ అందులో 300 మంది కూర్చుని ప్రయాణిస్తారని చెప్పుకొచ్చారు. అప్పుడు రైల్వే శాఖ ప్రయాణికులపై ఎందుకు జరిమానాలు విధించడం లేదని రాజ్‌భర్ ప్రశ్నించారు. జీపులో 9 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుందని.. కానీ అందులో 22 మంది కూర్చుని వెళతారని అన్నారు. వారికి కూడా ఎలాంటి జరిమానాలు ఉండవని పేర్కొన్నారు.

    ఇక తమ పార్టీ నుంచి ముఖ్తార్ అన్సారీని రంగంలోకి దించే విషయంపై రాజ్‌భర్ స్పందించారు. కోర్టు ఒకరిని దోషిగా నిరూపించే వరకు అతను దోషి కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఈసారి యూపీ ఎన్నికల్లో సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. యూపీలో ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10న తొలి దశ పోలింగ్ జరగనుంది. అందులో బాగ్‌పత్‌లోని 3, మీరట్‌లోని 7, ఘజియాబాద్‌లోని 5, హాపూర్‌లో 3, గౌతమ్ బుద్ నగర్‌లో 3, బులంద్‌షహర్‌లోని 7, బులంద్‌షహర్‌లోని 7, అలీఘర్, 5 మధుర, 9 ఆగ్రా అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్‌లో మొత్తం 623 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Trending news, Uttar pradesh

    తదుపరి వార్తలు