Viral Video : ప్రాణాల కంటే సెల్‌ఫోన్ ఎక్కువైపోయింది... భూకంపం వస్తుంటే...

7.1 తీవ్రతతో వచ్చిన భూకంపం అది. ప్రాణాలు క్షణాల్లో భూమిలో కలిసిపోయే పరిస్థితి. అలాంటి భూకంపంలో కూడా... ఆమె తన ప్రాణాల కంటే... తన సెల్‌ఫోన్‌ను కాపాడుకునేందుకే ప్రయత్నించింది. ఇప్పుడా వీడియో వైరల్ అయిపోయింది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 9:52 AM IST
Viral Video : ప్రాణాల కంటే సెల్‌ఫోన్ ఎక్కువైపోయింది... భూకంపం వస్తుంటే...
భూకంప వీడియోలో ఓ దృశ్యం (Image : Twitter / Geography made easy)
Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 9:52 AM IST
గత శుక్ర, శనివారాల్లో ఆమెరికాలో వరుసగా రెండు భూకంపాలు వచ్చాయని మనకు తెలుసు. వాటిలో శనివారం వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. దక్షిణ కాలిఫోర్నియాలో కొన్ని సెకండ్లపాటూ భూమి కంపించింది. దాదాపు 20 ఏళ్లలో వచ్చిన అతి పెద్ద భూకంపాల్లో ఇదీ ఒకటిగా గుర్తించారు. అలాంటి భూకంపం వస్తున్న సమయంలో... దెబ్రా బ్రూగల్ అనే మహిళ ఇంట్లోంచీ లాన్ లోకి పరిగెత్తుకొచ్చింది. అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాత ఆమె భూకంపం వల్ల కింద పడిపోయింది. ఆ సమయంలో... పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. అందులో నీరు భూ ప్రకంపనల వల్ల... భారీ అలల్లా ఎగసిపడుతోంది. ఆ టైంలో ఆ మహిళ తన మొబైల్ ఎక్కడ నీటిలో తడిసిపోతుందోనని టెన్షన్ పడుతూ... మొబైల్‌ని చేతిలో పట్టుకొని... భర్తకు టెక్స్ మెసేజ్ పంపడానికి ప్రయత్నిస్తూ... అరవసాగింది. కొన్ని క్షణాలపాటూ భూమి కంపించిన తర్వాత... ఆమె భర్త ఇంట్లోంచీ పరిగెడుతూ వచ్చి... ఆమెను (మొబైల్‌ని కూడా) కాపాడాడు.


ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. మూడు లక్షల మందికి పైగా చూశారు. కామెంట్లు ప్రవాహంలా వస్తున్నాయి. నెటిజన్లు ఆమెను తిడుతున్నారు. ప్రాణాల కంటే మొబైల్ ఎక్కువైపోయిందా అని ప్రశ్నిస్తున్నారు.




కొందరైతే... ఆ టైంలో నేను ఉంటే... మొబైల్‌ని పక్కన పడేసి పారిపోయేవాణ్ని అని అంటున్నారు.


ఆమె ఫోన్ తడవకుండా ప్రయత్నించడమేంటి... ఆమె భర్త ఆమెను ఫోన్‌తో సహా కాపాడటమేంటి... దేనికి ప్రాధాన్యం ఇస్తున్నారు అని కొందరు ప్రశ్నించారు.


మొత్తానికి ఆమె ఫోన్‌ని కాపాడారు మరో నెటిజన్ సెటైర్ వేశారు. ఆమె ఫోన్‌కి ఇన్సూరెన్స్ లేదా అన్నది మరో నెటిజన్ వేసిన ప్రశ్న.



ఈ భూకంపం వల్ల భారీ ప్రకంపనలు వచ్చి... భవనాలు కదిలాయి. లాస్ ఏంజిల్స్‌లో చాలాచోట్ల కరెంటు పోయింది. ప్రాణహాని మాత్రం జరగలేదని తెలిసింది.
First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...