Fact Check : టిబెట్‌లో నేలను తాకిన మేఘాలు... వైరల్ వీడియో.. నిజమెంత?

ఈమధ్య అసత్యాల్ని నిజాలుగా చెప్పి... వాటినే జోరుగా ప్రచారం చేయడం చాలా మందికి అలవాటవుతోంది. మరి టిబెట్‌లో మేఘాల సంగతేంటి?

news18-telugu
Updated: July 5, 2020, 9:08 AM IST
Fact Check : టిబెట్‌లో నేలను తాకిన మేఘాలు... వైరల్ వీడియో.. నిజమెంత?
టిబెట్‌లో నేలను తాకిన మేఘాలు... వైరల్ వీడియో.. నిజమెంత? (credit - twitter)
  • Share this:
టిబెట్ రోడ్డుపై.. నేలను తాకిన మేఘాలు... అంటూ... ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఎప్పుడూ జరగనిది ఏదైనా జరిగితే... మనం ఏం చేస్తాం... అవునా... నిజమా అని దాన్ని చూస్తాం. కొన్ని సందర్భాలలో అది నిజమే అనుకుంటాం. ఇప్పుడు టిబెట్‌లో మేఘాల వీడియో కూడా నిజమే అనుకుంటున్నారు చాలా మంది. వాస్తవమేంటంటే... అసలా వీడియో ఇప్పటిది కాదు. ఇక అందులోవి మేఘాలే కావు. అదో ఇసుక తుఫాను. దాన్ని మేఘాలుగా చెబుతూ... టిబెట్‌లో అద్భుతం జరిగిందని ప్రచారం చేస్తున్నారు. 2020లోనే ఇలాంటివి సాధ్యమని చెబుతుంటే... చాలా మంది నెటిజన్లు నిజమే అనుకుంటున్నారు.


అమెరికా టీవీ హోస్ట్ కెన్ రుత్కోస్కీ కూడా... 2018లో ఈ వీడియోను షేర్ చేసి... అరుదుగా జరిగే ఘటన ఇది అని తెలిపారు.


దీనిపై రివర్స్ సెర్చ్‌లో అసలు విషయం బయటపడింది. ఇది ఎప్పుడో 2016 జులై 4న చైనాలో వచ్చిన ఇసుక తుఫాను అని క్రొయేషియా వెబ్‌సైట్ వీడియోని రిలీజ్ చేసింది. అంటే... ఇసుక తుఫానును మేఘాలుగా చెప్పి... వీడియోని వైరల్ చేసి... క్యాష్ చేసుకుంటున్నారు కొందరు. ఇంటర్నెట్‌లో కనిపించేవన్నీ నిజాలు కావని మరోసారి రుజువుచేసింది ఈ న్యూస్.



ఇలాంటి ఇసుక తుఫానులు యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. కావాలంటే వాటిని చూసైనా... అది ఇసుక తుఫానే అని అర్థం చేసుకోవచ్చు.
Published by: Krishna Kumar N
First published: July 5, 2020, 9:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading