రెండేళ్ల పిల్ల... లతా మంగేష్కర్‌ని దించేసిందిగా...

రెండేళ్ల వయసులో మాట్లాడటమే కష్టం. అలాంటిది ఆ చిట్టి తల్లి ఏకంగా లతా మంగేష్కర్ పాటే పాడేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ చిన్న వీడియోని మళ్లీ మళ్లీ చూస్తూ... తెగ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు.

news18-telugu
Updated: December 3, 2019, 2:14 PM IST
రెండేళ్ల పిల్ల... లతా మంగేష్కర్‌ని దించేసిందిగా...
రెండేళ్ల పిల్ల... లతా మంగేష్కర్‌ని దించేసిందిగా...
  • Share this:
సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ మంచి వీడియోలు వస్తుంటాయి. వాటిలో ఒకటి ఇప్పుడు ప్రపంచమంతా చూస్తోంది. అందులో ఓ రెండేళ్ల చిన్నారి... ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన "లగ్ జా గలే" సాంగ్‌ను అచ్చుగుద్దినట్లు అలాగే పాడేసింది. రాగాలు, శృతి, లయ అన్నీ అలాగే ఉండటం, అంత చక్కగా పాడటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. బంగారు కొండ ఎంత బాగా పాడిందో అంటూ అంతా మెచ్చుకుంటున్నారు. ఆ చిట్టి తల్లి పాడిన పాటను మళ్లీ మళ్లీ వింటున్నారు. అంత క్యూట్‌గా పాడితే ఆ వీడియో వైరల్ కాకుండా ఎలా ఉంటుంది. ఆ తుఫాను మామూలుగా లేదు. విపరీతంగా షేర్ అవుతోంది. లైక్స్, కామెంట్స్ సునామీలా వచ్చిపడుతున్నాయి. మనకు మరో లతా మంగేష్కర్, శ్రేయా ఘోషాల్, సుశీల, చిత్ర దొరికేసిందని కామెంట్లతో మెచ్చుకుంటున్నారు. 

View this post on Instagram
 

#Musicon #lagjagale? #latamangeshkarji ???#babygirl?


A post shared by Pragya Medha (@pragyamedha11) on

వీడియో మీరూ చూశారుగా. పాట విన్నారుగా. ఎలా ఉంది. ఇంతకీ ఆ బంగారు తల్లి ఎవరన్న ప్రశ్నకు ఓ సమాధానం దొరికింది. పేరు ప్రజ్ఞా మెహతా అని తెలిసింది. సాధారణంగా ఇలాంటి వీడియోలు టిక్ టాక్‌లో చాలా వస్తున్నాయి. కానీ ఈ పాప అంత చిన్న వయసులో అంత చక్కగా పాడి అందరి హృదయాల్నీ గెలుచుకుంది. ఇటీవల బాలీవుడ్ సింగర్ రణు మండల్ ఇలాగే లతా మంగేష్కర్ క్లాసిక్స్ పాడి ఇండియా వైట్ క్రేజీ సింగర్‌గా మారారు. ఆమె పాడిన వీడియోలు రెగ్యులర్‌గా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ చిన్నారి వీడియో ఎప్పుడో జూన్‌లో పాడినది. ఇటీవల సింగర్ సితార దాన్ని షేర్ చేయడంతో... ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది.

 

కోలీవుడ్‌లో దూసుకొస్తున్న స్వాతిష్టా క్రిష్ణన్ఇవి కూడా చదవండి :

నిద్రపోతున్న పిల్లల్ని చంపి... సూసైడ్ చేసుకున్న దంపతులు... ఎందుకంటే...

Chandrayaan-2 : విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టిన కుర్రాడు ఇతనే...

ఈశాన్యంలో ఎగరనున్న శాంతి కపోతం... ఉల్ఫాతో కేంద్ర చర్చల్లో పురోగతి

నాసాకు ఝలక్... స్టూడెంట్లకు షాక్... కొంపముంచిన మైనర్...

Morning Diet : ఉదయాన్నే ఏం తినాలి... ఇలా ప్లాన్ వేసుకోండి
First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>